https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: నామినేషన్స్ లిస్ట్ లో టాప్ సెలెబ్స్… రెండో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. ఈసారి మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారట. వీరిలో టాప్ సెలెబ్స్ ఉన్న నేపథ్యంలో ఇంటిని వీడేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సెకండ్ వీక్ ఇంటిని వీడేందుకు నామినేట్ అయిన సభ్యులు ఎవరో చూద్దాం...

Written By:
  • S Reddy
  • , Updated On : September 9, 2024 / 04:11 PM IST

    Bigg Boss 8 Telugu(10)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం తో పాటు ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. కంటెస్టెంట్స్ లో చెప్పుకోదగ్గ సెలెబ్స్ లేరు. ఇది ఆడియన్స్ ని ఒకింత నిరాశకు గురి చేస్తుంది. కాగా సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఇంటిని వీడింది. బెజవాడ బేబక్క, నాగ మణికంఠ అత్యల్ప ఓట్లు పొందిన కంటెస్టెంట్స్ గా ఉన్నారు. వీరిద్దరిలో బేబక్క ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ఈ ఆదివారం వెల్లడించాడు.

    బేబక్క హౌస్లో సంచలనాలు చేస్తుంది అనుకుంటే మొదటివారమే ఎలిమినేట్ అయ్యింది. కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిన బేబక్కకు ప్రేక్షకులు గుడ్ బై చెప్పారు. ఇక వారం రోజులు హౌస్లో ఉన్న బేబక్కకు రూ. 1.30 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. సోమవారం సెకండ్ వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి.

    నామినేషన్స్ డే అంటే ఇంట్లో కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి చర్చలు నడుస్తాయి. వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. వారి మీద రంగు నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఇక రెండవ వారానికి గానూ మణికంఠ, పృథ్విరాజ్, నిఖిల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, సీత, నైనిక, శేఖర్ బాషా నామినేట్ అయ్యారట.

    వీరందరూ టాప్ కంటెస్టెంట్స్. ఈ క్రమంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది. విష్ణుప్రియకు జనాల్లో భారీ ఫేమ్ ఉంది. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ఆమెకు పాపులారిటీ ఎక్కువ. కాబట్టి విష్ణుప్రియకు ఆటోమేటిక్ గా ఓట్లు పడతాయి. శేఖర్ బాషా హౌస్లో ఎంటర్టైనర్ గా మారాడు. అలాగే అతనికి కూడా జనాల్లో గుర్తింపు ఉంది. సీరియల్ నటుడు నిఖిల్, నటుడు ఆదిత్య ఓం సైతం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు.

    కాబట్టి సీత, నైనికా, మణికంఠ, పృథ్విరాజ్ లలో ఒకరు ఇంటిని వీడే అవకాశం మెండుగా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. ఈ వారం రోజులు హౌస్లో కంటెస్టెంట్స్ చూపే పెర్ఫార్మన్స్ ని బట్టి ఓటింగ్ ఉంటుంది. కంటెస్టెంట్స్ గేమ్, మాట తీరు, ప్రవర్తన, టాస్క్ లలో చూపించే ప్రతిభ ఆధారంగా ఆడియన్స్ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తారు.

    ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుంది. మరో 5 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఈసారైనా పేరున్న సెలెబ్స్ ని ఎంపిక చేసి హౌస్లోకి పంపుతారేమో చూడాలి.