https://oktelugu.com/

Megastar Chiranjeevi: ఎట్టకేలకు మెగాస్టార్ తో ప్రాజెక్ట్ ను సెట్ చేసిన తమిళ్ స్టార్ డైరెక్టర్…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కోరుకుంటారు. అందులో తప్పులేదు కానీ దానికోసం మనం ఎంతలా కష్టపడుతున్నాం అనేది చూసుకోవాలి...

Written By:
  • Gopi
  • , Updated On : September 9, 2024 / 03:58 PM IST

    Megastar Chiranjeevi

    Follow us on

    Megastar Chiranjeevi: చాలామంది దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే కెరియర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలతో రాణిస్తూ వచ్చిన దర్శకులు ఆ తర్వాత మాత్రం ఒక్కసారైనా స్టార్ హీరో తో సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలని అనుకుంటారు. దాని ద్వారా వాళ్లకి కూడా దర్శకులుగా మంచి గుర్తింపు రావడమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఒక అరుదైన గుర్తింపును సంపాదించుకున్నవారు అవుతారు. ప్రస్తుతం తమిళ్ సినిమా దర్శకుడు ఆయన గౌతమ్ మీనన్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన యాక్టింగ్ మీద ఫోకస్ చేసి ఇతర దర్శకుల సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన మలయాళం సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న మమ్ముట్టి గారిని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.

    దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు…’డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ ‘ అనే సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఇక గౌతమ్ మీనన్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నాడు అంటూ పలు రకాల వార్తలైతే వచ్చినప్పటికీ ఎట్టకేలకు మలయాళం మెగాస్టార్ నే సెట్ చేశాడనే చెప్పాలి. వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలుగా చేయడంలో మమ్ముట్టికి మంచి పేరు అయితే ఉంది.

    ఆయన సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సినిమాల వరకు రిలీజ్ చేస్తూ ఇండస్ట్రీ లో ఎవరికీ దక్కని ఒక అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకోవడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు. కాబట్టి ఈ సినిమాతో కూడా ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన కెరియర్ లో ఇది ఒక వైవిధ్యమైన సినిమా అవుతుందంటూ గౌతమ్ మీనన్ చెప్పడం విశేషం…

    ఇక వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నట్లయితే మమ్ముట్టి పేరు మరోసారి ఇండియా వైడ్ గా మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ దర్శకుడు హీరో కలిసి ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…