Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 మొదటి నుండి ఆసక్తికర మలుపులతో సాగుతుంది. పవర్ అస్త్ర గెలిచిన వాళ్లే హౌస్ మేట్స్ అవుతారు. అప్పటి వరకు కంటెస్టెంట్స్ మాత్రమే అని నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. జనరల్ గా ఫస్ట్ వీక్ నుండి ఉండే కెప్టెన్సీ టాస్క్స్ స్థానంలో పవర్ అస్త్ర టాస్క్స్ నిర్వహించారు. సందీప్, శివాజీ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ మాత్రమే పవర్ అస్త్ర గెలిచారు. గత ఆదివారం రీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ని ప్రవేశ పెట్టారు.
అంబటి అర్జున్, నయని పావని, పూజా మూర్తి, భోలే షావలి, అశ్విని శ్రీ హౌస్లో అడుగుపెట్టారు. సోమవారం కొత్త పాత కంటెస్టెంట్స్ తో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇది మంగళవారం ముగియగా అమర్ దీప్, ప్రిన్స్ యావర్, తేజా, టేస్టీ తేజా, నయని పావని, అశ్విని శ్రీ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అదే రోజు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
ఏడుగురు కంటెస్టెంట్స్ ఓట్ల లెక్కలు బయటకు రాగా రిజల్ట్ షాకింగ్ గా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన ప్రిన్స్ యావర్ టాప్ లో ఉన్నాడు. అతడికి ముప్పై శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయని సమాచారం. ఇక రెండో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడట. అతడికి ఇరవై శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. తర్వాత పదిహేను శాతం ఓట్లతో తేజా, పది స్థానం ఓట్లతో అశ్విని శ్రీ ఉన్నారట.
ఇక నయని పావనికి ఏడు శాతం, పూజా మూర్తికి ఆరు శాతం, శోభా శెట్టికి ఐదు శాతం ఓట్లు పోల్ అయ్యాయట. కొత్త వాళ్ళ కంటే కూడా శోభా శెట్టి వెనుకబడ్డారని సమాచారం. నిజంగా ఇది ఊహించని పరిణామమే. ఈ లెక్కల ప్రకారం శోభా శెట్టి ఈ వారం ఇంటి నుండి వీడే హౌస్ మేట్ అవుతుంది. శోభా ఉన్న వాళ్లలో టాప్ సెలబ్రిటీ. గేమ్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. అలాగే శోభా ఎలిమినేట్ అయితే హౌస్ వీడిన ఆరో లేడీ కంటెస్టెంట్ అవుతుంది.