Top 1 Movie Bheemla Nayak: ఫిబ్రవరి నెల సినిమాలకు కొత్త ఊపు తీసుకొచ్చింది. కరోనా తగ్గి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా తెలుగులో భీమ్లానాయక్, తమిళంలో వాలిమై, హిందీలో గంగూభాయి కతియావాడి సినిమాలు గత వారాంతంలో విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈనెల టాప్ 5 చిత్రాలు.. వాటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఇవే..
1. భీమ్లానాయక్:
పవన్ కళ్యాణ్-రానా ప్రధాన పాత్రలలో అయ్యప్పమ్ కోషియం రిమేక్ గా వచ్చిన మూవీ ‘భీమ్లానాయక్’. ఈ రిమేక్ తెలుగులో గ్రాండ్ హిట్ అయ్యింది. సినిమాను బాగా తెరకెక్కించడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ప్రస్తుతానికి అన్ని చిత్రాలకంటే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా అగ్రస్థానంలో భీమ్లానాయక్ ఉంది.
2. గంగూభాయి కతియావాడి:
ముంబైలోని కమాటిపురకు చెందిన మాఫియా క్వీన్ బయోపిక్ ‘గంగూభాయి కతియావాడి’. ఈ బయోపిక్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆలియాభట్ నటనకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఫర్వాలేదనేలా కలెక్షన్స్ రాబట్టింది. ఉత్తర భారతంలో మంచి ప్రదర్శన కనబరిచింది.
3.వాలిమై
అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వాలిమై’. ఈ చిత్రం సగటు ఓపెనింగ్స్ రాబట్టింది. బ్యాడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అన్ని ఏజ్ గ్రూప్ ల ప్రేక్షకులకు నచ్చకపోవడంతో అన్ని సెంటర్స్ లలో కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి.
4. డీజే టిల్లు:
ఈ సినిమా మూడో వారానికి చేరుకుంది. భీమ్లానాయక్ రిలీజ్ తో కలెక్షన్లు పడిపోయాయి. పలు సెంటర్లలో కలెక్షన్లు యావరేజ్ గా ఉన్నాయి. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తో పాటు యువ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ కు రెడీ చేశారు. సిద్దు, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. విమల్ కృష్ణ దర్శకుడు.
Also Read: Bheemla Nayak Movie Issue : పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే!
5.అన్ హార్టెడ్
ఈ హాలీవుడ్ చిత్రం గతవారం విడుదలైనా మొదటిరోజు ఫర్వాలేదనేలా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. యువ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా సెంటర్లలో కలెక్షన్లు తగ్గాయి. మల్టీపెక్స్ లలో బాగానే నడుస్తోంది. రూబెన్ ష్లీషర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్, సోఫియా అలీ, మార్క్ ఎహెల్ బర్గ్, ఆంటోనియా బాండెరాస్ నటించారు.
ఈనెల విడుదలైన 5 చిత్రాల్లో టాప్ లో భీమ్లానాయక్ ఉంది. ఆ తర్వాత గంగూభాయి కతియావాడి రెండోస్తానంలో ఉంది.
Also Read: Bheemla Nayak Collections: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్ల టార్గెట్ ఖతం..
Recommended Video: