Top 3 Telugu Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ దర్శకులు ఏ మాత్రం సత్తా చూపించలేకపోతున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల పని కూడా అయిపోయింది. కేవలం తెలుగు సినిమా దర్శకుడు మాత్రమే ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నారనే చెప్పాలి. ప్రతి ఒక్క దర్శకుడు తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని కోరుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో తెలుగు దర్శకుల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీళ్ళ నుంచి వచ్చే సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read: నితీష్ కుమార్ రెడ్డికి గిల్ మామ అవుతాడా? వారి మధ్య బంధుత్వం ఎప్పటినుంచి? వైరల్ వీడియో
ఇకమీదట రాబోయే యంగ్ డైరెక్టర్లు సైతం సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే గొప్ప సబ్జెక్టులతో సినిమాలను చేయడానికి ప్రతి ఒక్క దర్శకుడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్ ను అందుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.
ఇక ఎలాంటి రిస్కీ షాట్స్ అయిన సరే చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. ఒక పాత్ర డిమాండ్ చేస్తే దానికోసం ఎంతటి వర్కౌట్స్ అయిన చేసి తన మేకోవర్లో కూడా ఎక్కడా తగ్గడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అన్ని రకాలుగా ముందుకు సాగుతోంది. ఇక డైరెక్టర్ల పరంగా చూసుకున్న హీరోలపరంగా చూసుకున్న ఇండియాలో ఉన్న అందరికంటే మనవాళ్లు ఉండడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన ఒక అరుదైన గౌరవం అనే చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇక మీదట మన దర్శకులందరు పాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక వాళ్ళు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ అయితే వాళ్ళ క్రేజ్ భారీగా పెరిగిపోతోంది. దానివల్ల కలెక్షన్స్ ని కూడా భారీగా సంపాదించాల్సిన అవసరమైతే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ ని కూడా పీక్ స్టేజ్ లో చేస్తూ ప్రతి ఒక్కరిని సినిమా పట్ల ఆకర్షితులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు…