Top 3 Indian Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తు ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయనను టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమా వస్తే చాలు ఆ సినిమా వందల కోట్లు కలెక్షన్స్ ను కొల్లగొడుతు ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులను నిరాశ పరచలేదు. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కూడా ప్రొడ్యూసర్లను సేఫ్ జోన్ లో ఉంచారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇండియాలో టాప్ 3 హీరోలుగా ఎవరు కొనసాగుతున్నారు అనే విషయం మీద తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి.
ప్రస్తుతం ప్రబాస్ నెంబర్ పొజిషన్లో కొనసాగుతున్న మాట వాస్తవం. అతని తర్వాత సైతం మన తెలుగు హీరోలే ఉన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి నటులు సైతం ప్రభాస్ తర్వాత స్థానంలో నిలవడం విశేషం. ఇక బాలీవుడ్ హీరోలైన రన్వీర్ సింగ్, రబీర్ కపూర్, షారుక్ ఖాన్ లాంటివాళ్ళు సైతం పోటీలో ముందు వరుసలో ఉన్నారు.
అయితే ఏది ఏమైనా కూడా మరొక ఐదు సంవత్సరాల సమయంలో ఇండియాని శాసించే టాప్ 3 హీరోలు వీళ్లే అవుతారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లయితే చేస్తున్నారు. ప్రస్తుతం మన హీరోలకు ఉన్న క్రేజ్ ను చూసుకుంటే ఫ్యూచర్ లో జరగబోయేది ఇదే అనే విషయమైతే అర్థమవుతుంది. ఇంతకీ టాప్ 3 లో నిలిచే హీరోలు ఎవరు అంటే ఒకరు ప్రభాస్ కాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కావడం విశేషం…
వీళ్ళ ముగ్గురు రాబోయే 5 సంవత్సరాలలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే హీరోలవ్వడమే కాకుండా వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంటారని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…