Khaidi 2 Movie: సూర్య సోదరుడు కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమా ద్వారానే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు సౌత్ ఇండియా మొత్తం మారుమోగిపోయింది. తెలుగు లో కూడా ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సప్రైజ్ హిట్ గా నిల్చింది. ఇప్పటికీ లోకేష్ తీసిన సినిమాల్లో ది బెస్ట్ ఏది అంటే అత్యధిక శాతం మంది ఖైదీ పేరు చెప్తారు. అంత అద్భుతంగా తీసాడు. కేవలం ఒక రాత్రి జరిగే స్టోరీ ఇది. స్క్రీన్ ప్లే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. అదే ఈ చిత్రం లోని ప్రత్యేకత. ఈ చిత్రం నుండే ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ మొదలైంది. ఈ యూనివర్స్ లోకి ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలు కూడా యాడ్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా ‘ఖైదీ’ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కానీ లోకేష్ కనకరాజ్ ఖైదీ తర్వాత మంచి క్రేజ్ రావడంతో విజయ్,రజినీకాంత్,కమల్ హాసన్ వంటి వారు ఆయన డేట్స్ ని లాక్ చేసుకున్నారు. విజయ్ తో ‘మాస్టర్’, ‘లియో’ వంటి చిత్రాలు తీసిన లోకేష్, తన అభిమాన నటుడు కమల్ హాసన్ తో ‘విక్రమ్’ సినిమా చేసాడు. ఇవి అన్నీ ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఆయన రజినీకాంత్ తో ‘కూలీ’ చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లోకేష్ వెంటనే కార్తీ తో ‘ఖైదీ 2 ‘ చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా లోకేష్ కనకరాజ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇందులో విక్రమ్ (కమల్ హాసన్) క్యారక్టర్ కూడా కనిపిస్తుందట. కార్తీ, కమల్ హాసన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయట. అదే విధంగా ‘విక్రమ్’ క్లైమాక్స్ లో ‘రోలెక్స్’ పాత్ర ద్వారా హీరో సూర్య సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్యారక్టర్ కూడా క్లైమాక్స్ లో కనిపిస్తుందట. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే సూర్య తో ‘రోలెక్స్’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత కమల్ హాసన్, కార్తీ, సూర్య కాంబినేషన్ లో ‘విక్రమ్ 2’ రానుంది. ఇందులో ముగ్గురి క్యారెక్టర్స్ ఫుల్ లెంగ్త్ లో ఉంటాయి. ఈ చిత్రం లో ‘లియో'(విజయ్) క్యారక్టర్ ఉంటుందో లేదో ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పొచ్చు. హాలీవుడ్ తరహాలో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేయడం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.