Tandel : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ మూవీ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న సందర్భంగా మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రం తమిళనాడు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, ఈ ఈవెంట్ కి కార్తీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. కచ్చితంగా ఈ చిత్రం తమిళనాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అంటూ బలమైన ప్రసంగం ఇచ్చాడు. రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపట్లో రానుంది. గీత ఆర్ట్స్ లో తెరకెక్కిన అన్ని సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా గతంలో విచ్చేశాడు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అల్లు అర్జున్ కి, ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే సంధ్య థియేటర్ ఘటన లో అరెస్ట్ తర్వాత ఆయన అభిమానుల ముందుకు వస్తున్న మొట్టమొదటి ఈవెంట్ ఇదే. అల్లు అర్జున్ ఏమి మాట్లాడబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ఎప్పుడు ఏ ఈవెంట్ కి వచ్చినా ఆరోజు మొత్తం ఎదో ఒక కాంట్రవర్సీ అవుతుంది. ఈసారి కూడా అలా కాంట్రవర్సీ చేయబోతున్నారా?, లేదా అనేది చూడాలి. ఇప్పటికే తండేల్ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పాటలతో పాటు, ట్రైలర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్లే ఈ సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా సినిమాలో ఎదో బలమైన కంటెంట్ ఉందని నమ్ముతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం వల్ల ఆ అంచనాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
చందు మొండేటి దర్శకత్వం లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ దాదాపుగా 80 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు. నాగ చైతన్య కెరీర్ లో ఇది భారీ బడ్జెట్ చిత్రం అనొచ్చు. పెట్టి ప్రతీ రూపాయి ట్రైలర్ లోనే కనిపించింది. VFX వర్క్ చాలా నేచురల్ గా అనిపించింది. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బ్లాక్ బస్టర్ తో ఈ ఏడాది ఘనంగా మొదలైంది. కలలో కూడా ఊహించని వసూళ్లు ఆ చిత్రానికి వచ్చాయి. ఇప్పుడు ‘తండేల్’ చిత్రం కూడా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంతో నాగ చైతన్య ఏకంగా వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి చేరిపోతాడని అక్కినేని అభిమానులు కూడా గట్టిగా నమ్ముతున్నారు.