Dating job offer monthly salary: మన దేశంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కుల వృత్తుల వారికి ప్రభుత్వాలు పింఛన్లు ఇస్తున్నాయి. మారుతున్న పరిస్థితులతో ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు కూడా మారుతునర్నాయి. కొత్తగా మహిళలకు ఉచిత బస్సు పథకం, నిరుద్యోగులకు ఆర్థికసాయం పథకాలు తెచ్చాయి. విద్యార్థులకు రుణాలు, స్కూటీలు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ పరిస్థితిలో జపాన్ కూడా ఒక ఆఫర్ ప్రకటించింది. ఇది బ్యాచ్‌లర్స్‌కు అక్కడ జనాభా వేగంగా తగ్గుతోంది. దీనికి పరిష్కారంగా సింగిల్స్‌కు డేటింగ్ యాప్ సబ్సిడీ ఇచ్చింది. కొచ్చి ప్రిఫెక్చర్ ప్రవేశపెట్టిన ఈ పథకం వివాహాలు, సంతానోత్పత్తిని పెంచే లక్ష్యంతో రూ.12,000 వరకు ప్రోత్సాహకం ఇస్తోంది.
జపాన్‌లో జనాభా సంక్షోభం..
జపాన్ ప్రపంచంలోనే అతి తక్కువ ఫెర్టిలిటీ రేట్(1.2)తో బాధపడుతోంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు జనాభాలో 29 శాతానికి పెరిగింది. 9 మిలియన్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. యువత పెళ్లిళ్లు, పిల్లలు కనడం మానేస్తోంది. కార్మిక శక్తి కరువు, పెన్షన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం. దీని పరిణామాలు ఆర్థిక వృద్ధిని 1%కి పరిమితం చేస్తున్నాయి.
జనాభా పెంపునకు పథకం..
జపాన్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి జనాభా పెంపునకు కొత్త పథకం అమలు చేస్తోంది. 29 నుంచి 39 ఏళ్లలోపు సింగిల్స్‌కు డేటింగ్/మ్యాచ్‌మేకింగ్ యాప్ ఖర్చులకు గరిష్ట 20 వేల యెన్ల (రూ.11,752) సబ్సిడీ ప్రకటించింది. రశీదులు సమర్పించి డబ్బు తిరిగి పొందొచ్చు. రిజిస్ట్రేషన్, మంత్లీ ఫీజులు కవర్ అవుతాయి. మ్యాచ్‌మేకింగ్ ఈవెంట్లు నిర్వహించే సంస్థలకు లక్ష యెన్ల (రూ.58,000) గ్రాంట్ ఇస్తుంది. సర్టిఫైడ్ యాప్‌లకు మాత్రమే వర్తిస్తుంది, ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌లకు కాదు.
ఇతర ప్రత్యామ్నాయాలు..
టోక్యోలో ఏఐ డేటింగ్ యాప్ ’టోక్యో ఎన్ముసుబి’ 18 ఏళ్లు దాటిన సింగిల్స్‌కు 11 వేల యెన్ రిజిస్ట్రేషన్ ఫీజు, 2 ఏళ్ల యాక్సెస్. వెరిఫికేషన్ కోసం డ్రైవర్ లైసెన్స్, ఆదాయ పన్ను రికార్డులు తప్పనిసరి. 36 గంటల్ వీక్లీ సెలవు పాలసీ అమలు చేస్తోంది. ఉద్యోగాలు చేసే జంటలకు వ్యక్తిగత సమయం కల్పించి ఫ్యామిలీ లైఫ్ ప్రోత్సహిస్తోంది. ఇంకా చైల్డ్ అలవన్స్ 18 ఏళ్ల వరకు, ఫ్రీ స్కూల్ మీల్స్, ఔట్‌గోయింగ్ బర్త్ కాస్ట్ ఇన్సూరెన్స్ ఇస్తోంది.
ఈ పథకం యువత ఆర్థిక భారం తగ్గించి సురక్షిత డేటింగ్ పరిస్థితి సృష్టిస్తుంది. ఫలితాలు 2–3 ఏళ్లో్ల కనిపించాలి.కొచ్చి గ్రామీణ ప్రాంతంలో జనాభా నష్టం ఆపడానికి రూపొందించారు. దక్షిణ కొరియా, యూరప్‌లో సారూప్య ప్రయత్నాలు ఉన్నాయి. భారత్‌లో ఫెర్టిలిటీ 2.0కి దిగుతున్న సమయంలో జపాన్ మోడల్ ప్రేరణగా మారవచ్చు.