Ram Charan: ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల దూకుడుని పెంచినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి, శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం వల్ల చరణ్ దాదాపు ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు వాళ్ల సినిమాల కోసమే టైమ్ కేటాయించాల్సి వచ్చింది. ఇక దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన కేవలం ఒక్క సినిమానే రిలీజ్ చేయడం గమనార్హం… అందుకే ఇప్పుడు అలాంటి డిలే లు ఏమి చేయకుండా ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ ని కవర్ చేస్తూ సినిమాలు చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన గేమ్ చేంజర్ అనే సినిమా షూటింగ్ పూర్తి దశకు రావడంతో ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ‘ఆర్ సి 17’ పేరుతో మరొక సినిమా కూడా చేయబోతున్నట్టుగా ఈ మధ్య రామ్ చరణ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదేంటి అంటే ఈ సినిమా 1947 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అప్పటి తెలంగాణలో రజాకార్ల పాలన మీద ఈ సినిమా ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక నిజానికి ఈ సినిమాని సుకుమార్ విజయ్ దేవరకొండ తో తెరకెక్కించాలనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఇక దాంతో ఇప్పుడు రామ్ చరణ్ తో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రజాకార్ల బ్యాక్ డ్రాప్ తో కనక తెరకెక్కిస్తే ఈ సినిమాకి చాలా రీచ్ అయితే దక్కుతుందనే చెప్పాలి.
ఈమధ్య రజాకార్ల ఆగడాలను తెలియజేస్తూ వచ్చినా “రజాకార్” సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? నిజంగానే రజాకార్ల బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నారా.? అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…