RadheShyam Movie: తెలుగు హీరోకి జాతీయస్థాయిలో క్రేజ్ రావడం అంటే.. బహుశా అది ఒక్క ప్రభాస్ కే చెల్లింది అనుకోవాలి. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరో ఏ సౌత్ హీరోకి లేదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. భాషలతో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలకు మార్కెట్ క్రియేట్ అయింది. పైగా సినిమాలు ప్లాప్ అయినా, ఓపెనింగ్స్ వస్తున్నాయి. అందుకే, ప్రభాస్ సినిమాల కోసం మిగిలిన భాషల్లో కూడా మంచి డిమాండ్ ఉంది.

ఈ నేపథ్యంలో జనవరి 14న విడుదల కానున్న ‘రాధేశ్యామ్’ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. హిందీలో కూడా ఈ సినిమా కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఒక విధంగా ఆర్ఆర్ఆర్ కంటే కూడా.. గ్రౌండ్ లెవల్ లో ఈ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉందట. మరి ఈ మాటలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఇప్పుడు ఈ సినిమాకు ఇదే పెద్ద మైనస్ అయ్యేలా ఉంది.
అంచనాలు లేని సినిమా కొంచెం బాగున్నా జనం ఆదరిస్తారు. అదే భారీ అంచనాలు ఉన్న సినిమా అద్భుతంగా ఉన్నా.. ఎక్కడో లోపం వెతుక్కుని మరీ విమర్శించడానికి రెడీ అవుతారు. కాబట్టి.. ‘రాధేశ్యామ్’కి ఏ రకంగా చూసుకున్నా ఎక్కువ అంచనాలు ఉండటం అంత మంచిది కాదు. ఇటు తెలుగునాట కూడా ‘రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ లేనిపోని హడావిడి చేస్తున్నారు.

అలాగే హిందీ రాష్ట్రాల్లో కూడా అనవసరమైన అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. అంచనాలు ఎక్కువ అయితే, టెర్రిఫిక్ ఓపెనింగ్స్ రావొచ్చు. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయి. అప్పుడు సినిమాకి నష్టాలే మిగులుతాయి. కాబట్టి.. పెరిగిన అంచనాలను ఎలా తగ్గించాలా అని ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ టీమ్ ఆలోచనలో పడింది.
Also Read: స్నేహితులతో కలిసి రాధేశ్యామ్ సినిమా చూసిన ప్రభాస్.. ఆ సీన్ మాత్రం?
అసలుకే నాలుగేళ్లుగా నిర్మాణం జరుపుకుంది ఈ సినిమా. సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండాలి. యాక్షన్ సినిమా కంటే కూడా లవ్ ఎమోషనల్ డ్రామాగానే ఈ సినిమా ఉండబోతుంది. అందుకే లవ్ స్టోరీస్ కి హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం.
Also Read: ప్రభాస్ ఫ్యాన్సే.. ప్రభాస్ సినిమా పై నెగిటివ్ ప్రచారమా ?
కాకపోతే, లవ్ అంటే కుర్ర వయసులో చేసుకునేది. 40 ప్లస్ లో ఉన్న ప్రభాస్, 30లలో ఉన్న పూజా హెగ్డే మధ్య లవ్ స్టోరీ అంటే ముదురు ప్రేమ కథ అవుతుందేమో.. అప్పుడు 40 ప్లస్ లో ఉన్న ప్రభాస్ తో లవ్ వర్కౌట్ అవుతుందా ? చూడాలి.