Tollywood: టైర్ 2 హీరోల విషయం లోనే అలా ఎందుకు జరుగుతుంది..?

టైర్ 2 సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఇక అదే స్టార్ హీరోల సినిమాలను థియేటర్ లోనే చూడాలి అనే ఉద్దేశ్యంతో థియేటర్ కి వస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 16, 2024 12:21 pm

Tollywood

Follow us on

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో వాళ్ల సినిమాలు యావరేజ్ గా ఉన్నప్పటికీ సూపర్ సక్సెస్ గా ఆడుతూ భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇక దానికి ఉదాహరణగా మనం ‘సలార్ ‘ సినిమాని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 750 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది. అయితే టైర్ 2 హీరోల సినిమాలు మాత్రం యావరేజ్ గా ఉన్నప్పటికీ వాటి కలెక్షన్లు అయితే భారీగా రావడం లేదు. ఇక పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో చాలా సినిమాలు నష్టాల బాట పడుతున్నాయి.

మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక నిజానికి స్టార్ హీరో సినిమాలు చూడడానికి ఫ్యామిలీతో పాటు అభిమానులు థియేటర్ కి వస్తారు. ఇక టైర్ 2 హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటి టాక్ తెలుసుకొని ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు. సినిమా యావరేజ్ టాక్ వస్తే మాత్రం ప్రేక్షకులు ఎవరు కూడా సినిమాని చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక దానికి తోడుగా సినిమా రిలీజ్ అయిన నెలలోపే ఓటిటి లోకి వస్తుంది.

కాబట్టి టైర్ 2 సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఇక అదే స్టార్ హీరోల సినిమాలను థియేటర్ లోనే చూడాలి అనే ఉద్దేశ్యంతో థియేటర్ కి వస్తున్నారు. కానీ టైర్ 2 హీరోల విషయంలో మాత్రం అది జరగడం లేదు అందువల్లే వాళ్ళ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా ప్లాప్ లుగా మిగులుతున్నాయి. ఇక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అనే ఒక టాక్ వస్తేనే ప్రేక్షకులందరూ మీడియం రేంజ్ హీరోల సినిమాలు చూడడానికి థియేటర్ కి వస్తున్నారు.

మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదా అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు… మంచి కంటెంట్ తో వచ్చి సినిమా సూపర్ సక్సెస్ కొట్టడం ఒక్కటే దానికి మార్గం అని మరికొంత మంది సినీ మేధావులు చెబుతున్నారు…