https://oktelugu.com/

Vijay Sethupathi: విజయ్ సేతుపతి లాంటి నటులు తెలుగు లో ఎందుకు రావడం లేదంటే..?

నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు తెలుగు వాళ్ల ముందు ఎందుకు పనికిరారు అంటూ కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 16, 2024 / 12:26 PM IST

    Vijay Sethupathi

    Follow us on

    Vijay Sethupathi: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విజయ్ సేతుపతి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకోవడానికి చాలా వరకు కష్టపడుతున్నాడు. ఇక అందుకే ఆయన డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఒక సినిమాలో హీరోగా నటిస్తూనే మరొక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటిస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ అయితే పొందుతున్నాడు.

    ఇక తమిళం లోనే కాకుండా ఇతర భాష లా సినిమాల్లో కూడా తను నటిస్తూ నటుడిగా మంచి పెరైతే సంపాదించుకున్నాడు. అయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీ కంటే కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికీ అందులో ఎవరు కూడా విజయ్ సేతుపతి లా ఎందుకు చేయడం లేదు అంటూ చాలామంది తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన పలు రకాల విమర్శలైతే చేస్తున్నారు. నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు తెలుగు వాళ్ల ముందు ఎందుకు పనికిరారు అంటూ కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.

    అయినప్పటికీ విజయ్ సేతుపతి లాంటి ఒక గొప్ప నటుడు తమిళ్ ఇండస్ట్రీ నుంచి బయటికి రావడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి తెలుగు లో అలాంటి నటులు ఎందుకు రావడం లేదు అంటే మన తెలుగులో ఉన్న చాలా మంది మంచి నటులు ఎప్పుడు హీరోలు గానే కొనసాగుతూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. సక్సెస్ లు వచ్చిన రాకపోయిన వాళ్ళు హీరోగానే కొనసాగుతూ ఉంటారు తప్ప డిఫరెంట్ పాత్రలను పోషించడానికి వాళ్ళు ఎప్పుడు సాహసం చేయరు. అందువల్లే మంచి నటులుగా ఉన్నా వాళ్ళు కూడా వాళ్లకు సినిమాలపరంగా సరైన సక్సెస్ లేకపోవడం వల్ల వాళ్లు లైమ్ లైట్ లోకి రాలేకపోతున్నారు.

    నిజానికి వాళ్ళు స్టార్ ఇమేజ్ ను వదిలేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రల్లో నటిస్తే మాత్రం మంచి గుర్తింపు అయితే వస్తుంది. కానీ వాళ్ళు అలా చేయడం లేదు ఎంతసేపు ఇమేజ్ చట్రం లోనే మునిగిపోతున్నారు.కానీ దాంట్లో నుంచి బయటకు రావడం లేదు. చూడాలి మరి ఇకమీదటైనా విజయ్ సేతుపతి లాంటి నటులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా వస్తారా లేదా అనేది…