Homeఎంటర్టైన్మెంట్Ali tho Saradaga: ఆగడు సినిమా ఫ్లాప్ ఎందుకు అయ్యింది ? స్టార్ హీరో...

Ali tho Saradaga: ఆగడు సినిమా ఫ్లాప్ ఎందుకు అయ్యింది ? స్టార్ హీరో తో అవకాశాన్ని మిస్ చేసుకున్న శ్రీను వైట్ల

Ali tho Saradaga: ఈ మధ్య కాలంలో బుల్లి తెర పై ఉన్న టాక్ షో లలో క్రేజీ టాక్ షో గా పేరు పొందింది మాత్రం ‘అలీ తో సరదాగా’. టాలీవుడ్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షో ని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. కొత్త – పాత, చిన్నా- పెద్దా, వెండితెర – బుల్లితెర అని తేడా లేకుండా ప్రతి ఒక్క సెలబ్రిటీ ని పిలిచి సరదాగా ప్రేక్షకులకి తెలియని ముచ్చట్లు పంచిపెడుతున్నారు.

ఎలాంటి సినిమాలు హిట్ అవుతాయి, ఎలాంటి సినిమాలు ప్లాప్ అవుతానేయి అనే విషయం మాత్రం ప్రేక్షక చేతుల్లోనే ఉంటుంది. ప్రతి డైరెక్టర్ ప్రతి ఒక్క సినిమాని ప్రాణం పెట్టి తీస్తాడు. తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాడు. కానీ, కొన్ని అనుకోని కారణాల వాళ్ళ అనుకోని రీతిలో సినిమాలు ఫ్లోప్స్ అవుతుంటాయి. కథ ఎంత బాగున్నా అప్పుడప్పుడు బాక్స్ ఆఫీసు ముందు బొక్క బోర్లా పడతాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఆగడు.

అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల కొన్ని సంచలన నిజాలని బయట పెట్టాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి మాస్ సినిమా తీయండని బాగా గోల వచ్చిందని అన్నాడు శ్రీను వైట్ల. అంతేకాకుండా అనుకున్నది ఒకటి తీసింది ఒకటి కాబట్టి సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకే సెల్ఫీష్ గా ఉండాలి అనే విషయం నేర్చుకున్నాను అని చెప్పాడు.

గోవా లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అజిత్ ని కలిసే అవకాశం వచ్చింది, అప్పుడు అజిత్ గారు దూకుడు సినిమాని తమిళ్ లో తియ్యమని అజిత్ అవకాశం ఇచ్చిన చెయ్యలేకపోయినని శ్రీను వైట్ల తెలిపాడు. ఇప్పటికీ ఆ విషయం బాధ పెడుతుందని తెలిపాడు కూడా.

 

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.
RELATED ARTICLES

Most Popular