https://oktelugu.com/

Surya: సూర్య ఎందుకు ఆ సూపర్ హిట్ సినిమాను వదులుకున్నాడు..?

సూర్య తన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలను చేసినప్పటికీ అందులో కొన్ని సినిమాలను వదిలేసి చాలా వరకు తప్పు చేశానని ఆయన కూడా చాలా సార్లు భదపడ్డారట. ఆయన చేసిన సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలిచాయి. అయినప్పటికీ ఆయన వదిలేసిన కొన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అందులో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన 'అపరిచితుడు ' సినిమాని మొదట శంకర్ సూర్య తోనే చేయాలి అనుకున్నాడట. కానీ అప్పుడు అనుకొని కారణాలవల్ల సూర్య ఆ సినిమాని మిస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 02:37 PM IST

    Surya

    Follow us on

    Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ఇప్పుడున్న జనరేషన్ లో గుర్తొచ్చే ఏకైక పేరు సూర్య… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ తనకున్న పొటెన్షియాలిటీని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన శివ డైరెక్షన్ లో ‘కంగువ’ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ పదోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న సూర్య ఎలాగైనా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే సూర్య తన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలను చేసినప్పటికీ అందులో కొన్ని సినిమాలను వదిలేసి చాలా వరకు తప్పు చేశానని ఆయన కూడా చాలా సార్లు భదపడ్డారట. ఆయన చేసిన సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలిచాయి. అయినప్పటికీ ఆయన వదిలేసిన కొన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అందులో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘అపరిచితుడు ‘ సినిమాని మొదట శంకర్ సూర్య తోనే చేయాలి అనుకున్నాడట. కానీ అప్పుడు అనుకొని కారణాలవల్ల సూర్య ఆ సినిమాని మిస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమాతో పాటుగా మురుగదాస్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి ‘ సినిమాని కూడా మొదట సూర్యతోనే చేయాలని మురుగదాస్ చాలా ప్రయత్నం చేసినప్పటికీ, అప్పుడు సూర్య వేరే సినిమాలు కమిట్ అయి ఉండడం వల్ల ఈ సినిమాని కూడా వదిలేసుకోవాల్సి వచ్చిందట. ఇక ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా విజయ్ కి ఎనలేని గుర్తింపు ను కూడా తీసుకొచ్చి పెట్టింది.

    మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే టాప్ హీరోగా కొనసాగుతున్న సూర్య ఈ సినిమాలను కనక చేసి ఉంటే ఆయన కెరియర్ పరంగా మరింత ముందుకు వెళ్లేవాడని మరి కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి సూర్య లాంటి హీరో ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నాడు అంటే దానికి కారణం ఆయన పర్ఫామెన్స్ అనే చెప్పాలి. ఎలాంటి క్యారెక్టర్ లో అయిన మెప్పించగలిగే కెపాసిటీ ఆయన సొంతం. అందుకే శివపుత్రుడు సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ నుంచి రీసెంట్ గా చేసిన జై భీమ్ లో ఆయన పోషించిన క్యారెక్టర్ వరకు అన్ని పాత్రల్లో మెప్పించాడు.

    ఇక దాంతో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన లాంటి నటులు ఇండస్ట్రీ లో ఎంతమంది ఉన్నా కూడా ఆయన మాత్రం అందులో ప్రత్యేకంగా కనిపిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక మొత్తానికైతే సూర్య వదిలేసుకున్న సినిమాలను పక్కన పెడితే ఆయన చేసిన సినిమాలకు మాత్రం ఆయన చాలా వరకు న్యాయం చేశాడు. ఇక ఇప్పుడు కూడా రాబోయే సినిమాలతో మరోసారి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.

    ముఖ్యంగా తెలుగు, తమిళ్ ప్రేక్షకులను పక్కన పెడితే ఆయన బాలీవుడ్ ప్రేక్షకులను ఎక్కువగా అలరించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో ఒక డిఫరెంట్ పాత్రలో కూడా ఆయన నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలతో ఆయన బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తాడా? ఆయన సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఒక వేళ అక్కడ ఆయన స్టార్ హీరో అయితే ఫ్యూచర్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్ట్రెయిట్ గా ఒక సినిమా చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…