Venkatesh: ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలను చేయడంలో శోభన్ బాబు ఎలాంటి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడో ఆయన తర్వాత జనరేషన్ లో విక్టరీ వెంకటేష్ కూడా అలాంటి ఒక గొప్ప పేరునైతే తెచ్చుకున్నాడు. ఇక ఆయన ఫ్యామిలీ సబ్జెక్టులను ఎంచుకుంటూ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయన లాంటి సినిమా హీరో మరొకరు లేరు అనేంత లా ఫ్యామిలీ సబ్జెక్టును డీల్ చేస్తూ కలెక్షన్లను కొల్లగొట్టాడ్. ఇక వంటింటికి మాత్రమే పరిమితమైన ఫ్యామిలీ లేడీస్ ని సైతం థియేటర్లకి రప్పించిన ఏకైక హీరో కూడా వెంకటేశ్ కావడం విశేషం.
ఇక అలాంటి వెంకటేష్ గత కొన్ని రోజుల నుంచి సక్సెస్ లను అందుకోవడంలో కొంత వరకు తడబడుతున్నట్టుగా తెలుస్తుంది. ‘ఎఫ్2 ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు. కాబట్టి ఆ క్రెడిట్ ఇద్దరి హీరోలకి వెళుతుంది. ఇక ఎఫ్ 3 సినిమాతో మెప్పించినప్పటికీ అది అంతా హిట్ సినిమా అయితే కాదు. ఇక రీసెంట్ గా శైలేష్ కోలన్ దర్శకత్వంలో చేసిన సైంధవ్ సినిమాతో ఒక డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇప్పుడు ‘అనిల్ రావిపూడి’ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు ఇద్దరు స్టార్ డైరెక్టర్లను కూడా తను లైన్ లో పెట్టినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో విరాటపర్వం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు ఉడుగుల దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక దానికి సంబంధించిన కథ చర్చలను ప్రస్తుతం వెంకటేష్ తో జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా మరొక యంగ్ డైరెక్టర్ తో కూడా వెంకటేష్ ఒక సినిమా కమిట్ అయ్యాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక వెంకటేష్ స్పీడ్ చూస్తుంటే ఎలాగైనా సరే తను చాలా ఎక్కువ సినిమాలు చేసి మంచి విజయాలు అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆ ఉద్దేశ్యంతోనే తను తొందరగా సినిమాలను ఒకే చేసి ఆ సినిమాలను వీలైనంత తొందరగా సెట్స్ మీదకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఒకవేళ వెంకటేష్ కనక ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నట్లైతే సీనియర్ హీరోలలో తను కూడా టాప్ హీరో రేంజ్ లోకి వెళ్తాడు.
ఇక ఇప్పటికే బాలయ్య బాబు, చిరంజీవి ఇద్దరు వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే వాళ్ళు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను కూడా చేస్తున్నారు. కానీ వెంకటేష్ మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తు తెలుగుకే పరిమితం అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు వెంకటేష్ చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా మినిమం గ్యారంటీగా నిలిచేది. మరి అలాంటి వెంకటేష్ నుంచి ఎందుకు ఒక క్వాలిటీ సినిమా రాలేకపోతుంది అని తన అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సబ్జెక్టులను కనక చూస్తుంటే మళ్లీ వెంకటేష్ ఒకప్పటి ట్రాక్ ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఒకప్పుడు ఆయన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి ‘, ‘వసంతం ‘ లాంటి డీసెంట్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి డీసెంట్ సినిమాలతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాలని చూస్తున్నాడు… మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో మరోసారి వింటేజ్ వెంకటేష్ ను మనకు పరిచయం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…