Homeఎంటర్టైన్మెంట్Anirudh Ravichander Dominance: అనిరుధ్ కి ఎవ్వరు పోటీ ఇవ్వలేకపోతున్నారు... దానికి కారణం ఇదే...

Anirudh Ravichander Dominance: అనిరుధ్ కి ఎవ్వరు పోటీ ఇవ్వలేకపోతున్నారు… దానికి కారణం ఇదే…

Anirudh Ravichander Dominance: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఎవరు ఏ భాషలో సినిమా చేసిన కూడా ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటుగా సినిమాల మధ్య పోటీ కూడా పెరిగిపోయింది. టెక్నీషియన్స్ ఎవరు అనే విషయంలో కూడా చాలామంది చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిరుద్ కి చాలా గొప్ప క్రేజ్ అయితే ఏర్పడింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఆయన ప్రస్తుతం తెలుగు తమిళ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలైతే చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు తెలుగులో భారీ పాపులారిటి అయితే దక్కుతుంది. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా తను మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండడం విశేషం… నిజానికి అనిరుద్ కి అంత మంచి క్రేజ్ ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే ఆయన కంపోజ్ చేసిన పాటలు అటు తెలుగు ఇటు తమిళ్ తో పాటు ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తున్నాయి.

అందుకే ఇక దాంతోపాటుగా ఆయన ఒక సినిమాకి ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్, రజనీకాంత్ హీరోగా చేసిన జైలర్ సినిమాలు సైతం బ్యా గ్రౌండ్ స్కోర్ తోనే సూపర్ హిట్స్ అయ్యాయంటే ఆ ఘనత అనిరుధ్ కే దక్కుతుంది…

ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరు చాలా అప్డేటెడ్ వెర్షన్స్ తో ముందుకు సాగుతున్న క్రమంలో డిఫరెంట్ మ్యూజిక్ ని వాళ్ళకి అందించడానికి అనిరుద్ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారట. ప్రస్తుతం ఆయన ఒక సినిమా కోసం దాదాపు 15 కోట్లకు పైన రెమ్యూనరేషన్స్ ను ఛార్జ్ చేస్తుండడం విశేషం… ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular