Chiranjeevi First Hit: సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఆ హీరోలను స్టార్లుగా మార్చడంలో తెరవెనుక దర్శకులు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. వాళ్లని మాత్రం ఎవ్వరు గుర్తుంచుకోరు. స్క్రీన్ మీద కనిపించే హీరోలను చూడడానికి మాత్రమే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు. కాబట్టి హీరోలే ఆటోమేటిగ్గా హైలైట్ అవుతూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి అప్పట్లో సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు మాత్రం కొందరే ఉండేవారు. అందులో దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు లాంటి దర్శకులకు మంచి గుర్తింపైతే ఉండేది. వీళ్ళు చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు… అప్పుడున్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి ఇండస్ట్రీ హిట్ లను నమోదు చేసిన ఈ దర్శకులు 100కు పైగా సినిమాలను చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…చిరంజీవితో తన మొదటి సినిమాను చేసి స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకులు ఒకరున్నారు. ఆయన ఎవరు అంటే ‘కోడి రామకృష్ణ’ (Kodi Ramakrishna)…ఈయన చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన ఈ సినిమాతో చిరంజీవికి భారీ విజయాన్ని కట్టబెట్టడమే కాకుండా మొదటి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఇక ఆయన తన ఎంటైర్ కెరియర్ లో 100కు పైగా సినిమాలను చేయడమే కాకుండా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలను చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్రాఫిక్స్ ను పరిచయం చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఆయన ఎంటైర్ కెరియర్ లో అమ్మోరు, దేవి, అంజి, అరుంధతి లాంటి భారీ గ్రాఫికల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు…
ఈ మధ్యకాలంలో రాజమౌళి లాంటి దర్శకుడు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో కోడి రామకృష్ణ ఒకప్పుడు గ్రాఫిక్స్ తో ఆడుకున్నాడనే చెప్పాలి. అమ్మోరు సినిమాతో ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన ఆయన దేవి సినిమాతో ఆకాశంలో నుంచి నాగ కన్య భూమ్మీదికి రావడం ఇక్కడ ప్రజలను కాపాడడం లాంటి సన్నివేశాలను చాలా హై క్వాలిటీతో తెరకెక్కించాడు.
ఇక ఏది ఏమైనా కూడా కోడి రామకృష్ణ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచడనే చెప్పాలి… అనుష్క (Anushka) లాంటి హీరోయిన్ ను పెట్టి అరుంధతి (Arundhathi) లాంటి సినిమాతో అటు గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాని చేస్తూనే, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించి సూపర్ సక్సెస్ ని సాధించాడు…