Homeఎంటర్టైన్మెంట్Rangamartanda: ‘రంగమార్తండ’లో బ్రహ్మనందం సరికొత్త రోల్..!

Rangamartanda: ‘రంగమార్తండ’లో బ్రహ్మనందం సరికొత్త రోల్..!

Rangamartanda: క్రియేటీవ్ దర్శకుడు కృష్ణ వంశీ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ మూవీని దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కృష్ణవంశీ ఈసారి ‘రంగమార్తండ’తో సూపర్ హిట్ కొడుతాననే నమ్మకంతో ఉన్నాడు.

RangaMarthanda

‘నట సామ్రాట్’ మూవీలో నానా పటేకర్ చేసిన పాత్రను తెలుగులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉంది. నానా ప‌టేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్ర‌మ్ గోఖ‌లే న‌టించాడు. ఆయ‌న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఒక సన్నివేశంలో నానాని పూర్తిగా డామినేట్ చేసేస్తారు.

అలాంటి పాత్రకు దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులో బ్ర‌హ్మానందానికి ఇచ్చారు. ఈ పాత్ర పూర్తి సీరియస్ ఎమోష‌న‌ల్ రోల్‌ తోపాటు యాంటీ క్లైమాక్స్ ఉంటుంది. దీంతో ఈ పాత్రకు బ్రహ్మనందంను ఎంచుకోవడం కృష్ణ వంశీది సాహసమనే చెప్పాలి. ఇక ఈ పాత్ర కోసం బ్రహ్మనందం తొలి గడ్డం కూడా పెంచారట. దీంతో ఆయన లుక్కుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవల రంగమార్తండ షూటింగ్ లో ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందంలపై ఓ కీలక సన్నివేశం తెరకెక్కించారు. ఇందులో బ్రహ్మనందం నటన చూసి కృష్ణ వంశీ భావోద్వేగానికి లోనయ్యారట. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ విన్పిస్తోంది. అప్పటి నుంచి ఈ సినిమాలో బ్రహ్మనందం ఇరగదీశాడనే వార్త హల్చల్ చేస్తోంది.

ఇదిలా ఉంటే కృష్ణవంశీ ‘రంగమార్తండ’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలియగానే ఓ ప్రముఖ సీనియర్ నటుడు ఆయనకు ఫోన్ చేసి విక్రమ్ గోఖలే పాత్ర చేస్తానని, రెమ్యూనరేష్ ఏమి వద్దని చెప్పాడట. అయితే కృష్ణవంశీ మాత్రం ఆ పాత్రలో బ్రహ్మనందాన్ని మాత్రమే చూస్తున్నానని చెప్పాడట. దీంతో ఈ పాత్రపై కృష్ణ‌వంశీకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version