https://oktelugu.com/

Tollywood Sequels: బాహుబలి నుంచి డీజే టిల్లు వరకు సిక్వెల్స్ సినిమాల పరిస్థితి ఏంటి..?

Tollywood Sequels బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్రెండ్ అనేది సాగుతుంది పార్ట్ వన్ పార్ట్ 2 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రతి సినిమా కు సీక్వెల్ని అనౌన్స్ చేస్తూ దర్శకులు ఆ సినిమాలను తీసే పనిలో బిజీగా ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 28, 2024 / 07:54 AM IST

    Tollywood Sequels

    Follow us on

    Tollywood Sequels: ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం సీక్వెల్స్ సినిమాల హవా అయితే బీభత్సంగా నడుస్తుందనే చెప్పాలి. ప్రతి సినిమా కూడా తమ సినిమాలకు సీక్వెల్స్ ను అనౌన్స్ చేస్తూ ఆ సినిమాలను తీసే పనుల్లో బిజీగా ఉన్నారు.

    ఇక బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్రెండ్ అనేది సాగుతుంది పార్ట్ వన్ పార్ట్ 2 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రతి సినిమా కు సీక్వెల్ని అనౌన్స్ చేస్తూ దర్శకులు ఆ సినిమాలను తీసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే బాహుబలి తర్వాత పుష్ప సినిమా కూడా రెండు పార్టు లుగా వస్తుంది. ఇక మొదటి పార్ట్ గా వచ్చిన పుష్ప సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక వీళ్ళ ఇన్స్పిరేషన్ తో డీజే టిల్లు సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇక మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడం తో వెంటనే సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసి కంప్లీట్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు.

    ఇక ఈ సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఒకసారి హిట్ అయిన క్యారెక్టర్లని వాళ్ల క్రేజ్ ను వాడుకోవడానికి పార్ట్ 2 సినిమాలు తీసి సక్సెస్ కొడుతున్నారని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఒక వంతుకు పార్ట్ 2 చేయడం మంచిదే అయినప్పటికీ మరీ ఎక్కువ పార్టు లు చేస్తే మాత్రం సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది.

    ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లతోనే సినిమాలు ఆగిపోతే మంచిదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాబోయే సలార్ 2 సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి…ఇక మొత్తానికైతే ఇప్పుడు సిక్వెల్స్ హవా చాలా బాగా కొనసాగుతుందనే చెప్పాలి… బాహుబలి తో ఈ ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది…