Prabhas Latest News: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించడం అనేది అంత ఈజీ కాదు. ఎవరు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి పెద్ద సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి సినిమాతో గొప్ప క్రేజ్ ను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగు డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలను ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయన మధ్యలో ప్రశాంత్ నీల్ లాంటి కన్నడ డైరెక్టర్ ను కూడా ఎంకరేజ్ చేశాడు.
ఇక తమిళ్ స్టార్ డైరెక్టర్లలందరు ప్రభాస్ కి కథను వినిపించాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన మాత్రం ఎవరి కథలను వినట్లేదు అనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేస్తున్న స్పిరిట్ సినిమా 2026 ఎండింగ్ కళ్ళ పూర్తయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 సినిమాలతో బిజి కానున్నాడు.
ఇక ఈ సినిమా లైనప్ తో ఆయన దాదాపు 2 సంవత్సరాల వరకు తన డేట్స్ ఖాళీగా లేకుండా ఫుల్ బిజీగా ముందుకు సాగుతున్నాడు. ఇక తమిళ్ డైరెక్టర్లు అయిన లోకేష్ కనకరాజు, నెల్సన్ లాంటి డైరెక్టర్లు ప్రభాస్ కి కథలను వినిపించాలనే ప్రయత్నం చేసిన కూడా ఆయన వాళ్లను పట్టించుకోవడంలేదట. కారణం ఏంటి అంటే తమిళ్ డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లను అందుకోలేకపోతున్నారు.
వాళ్లతో పోలిస్తే తెలుగు డైరెక్టర్లు చాలా బెటర్ ప్రతి డైరెక్టర్ తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళందరు బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…