Kannappa: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో మంచు విష్ణు హీరోగా వస్తున్న భక్తకన్నప్ప సినిమా ఒకటి…అయితే ఈ సినిమా కోసం విష్ణు దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించడం అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. అయితే ఇప్పటివరకు విష్ణు ఎప్పుడు కూడా ఇలాంటి రిస్క్ అయితే చేయలేదు. ఇక మొదటిసారి తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఇలాంటి ఒక రిస్క్ చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మొత్తం పాన్ ఇండియా స్టార్లతో నింపేస్తున్నాడు. ఇక అందులో “యంగ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్”, “కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ “లాంటి ప్రముఖులు నటిస్తున్నారనే టాకైతే వస్తుంది.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడిని మొదటి రెండు మూడు రోజుల్లోనే రాబట్టుకోవడానికి విష్ణు పలు రకాల కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం మోహన్ లాల్ ఈ సినిమాలో రాక్షస రాజుగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తున్నాడనే టాకైతే వస్తుంది. కాబట్టి వీళ్ళ మధ్య ఒక పెద్ద ఫైట్ కూడా జరగబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక మోహన్ లాల్ ప్రభాస్ మధ్య భారీ యుద్ధం జరిగే సీన్ కూడా ఉందట. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఇక విష్ణు కూడా ఈ సినిమా మీద చాలా ఫోకస్ పెట్టి మరి నటిస్తున్నాడు. తను భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే తను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటి వరకు సరైన సక్సెస్ అయితే లేదు. నిన్నకాక మొన్న వచ్చిన యంగ్ హీరోలు సైతం భారీ హిట్లను కొడుతుంటే విష్ణు సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడంలో చాలా వెనుకబడి పోయాడు. అందువల్లే తను ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే ఒక భారీ ప్రయోగానికి తెర లేపినట్టుగా తెలుస్తుంది…
ఇక ఈ సినిమా మొత్తం లో మోహన్ లాల్, ప్రభాస్ మధ్య జరిగే వార్ సీన్ చాలా హైలెట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…అయితే ఈ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ ఆ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు…