Posani Krishna Murali: శివ సినిమాను పోసాని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి..?

రామ్ గోపాల్ వర్మ చేసిన మొదటి సినిమా అయిన శివ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మొదటి సినిమాతోనే ఆయన స్టార్ డమ్ తారా స్థాయికి చేరిందనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : March 1, 2024 5:59 pm
Follow us on

Posani Krishna Murali: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాదిస్తుంటే, మరి కొంతమంది మాత్రం వాళ్ళకి నచ్చిన సినిమాలనే చేస్తున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తు ఉంటారు. అందులో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఈయన ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఎవరికి తెలియదు.

ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడో కూడా పసిగట్టడం చాలా కష్టం… అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఈయన చేసిన మొదటి సినిమా అయిన శివ సినిమా(Siva Movie) మాత్రం సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మొదటి సినిమాతోనే ఆయన స్టార్ డమ్ తారా స్థాయికి చేరిందనే చెప్పాలి. ఇక శివ సినిమా కోసం డైలాగ్ రైటర్ గా ముందు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) తీసుకుందామని అనుకున్నాడట. కానీ పోసాని శివ సినిమాకి వర్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దానివల్లే ఆయనని మార్చి ఆయన ప్లేస్ లో తనికెళ్ల భరణి గారిని తీసుకున్నారు.

ఇక శివ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత వెంకటేష్ తో ఆయన చేసిన క్షణక్షణం సినిమా కోసం రైటర్ గా మళ్లీ పోసాని గారిని పెట్టుకోవడం విశేషం. ఇక పోసాని, వర్మ ఇద్దరు కూడా డిఫరెంట్ మెటాలిటీతో ఉండడం వల్ల వీళ్లకు ఈ సినిమా రైటింగ్ సమయంలో చాలాసార్లు గొడవలు జరిగినట్టుగా కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి… మొత్తానికైతే వర్మ ఏం చేసినా ఒక సంచలనంగా మిగిలిపోతుందనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే వెంకటేష్ కి, నాగార్జున కి ఇద్దరికీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వర్మ చిరంజీవికి మాత్రం సినిమా చేస్తానని చెప్పి హ్యాండిచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం వర్మకి సినిమా ఇచ్చే హీరో లేడనే చెప్పాలి. అందుకే ఆయన పబ్లిసిటీ కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నాడు అనే విషయం ఆయన సినిమాలను చూస్తే మనకు అర్థమైపోతుంది…