https://oktelugu.com/

Nayani Pavani: ఆ షో నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్ ని తప్పించిన స్టార్ మా.. అసలు ఏం జరిగింది?

సోషల్ మీడియాలో నయని పావని కి ఫుల్ క్రేజ్ ఉంది. టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. పైగా నయని పావని మంచి డాన్సర్.

Written By: , Updated On : March 31, 2024 / 03:18 PM IST
Nayani Pavani

Nayani Pavani

Follow us on

Nayani Pavani: నయని పావని – ప్రిన్స్ యావర్ నీతోనే డాన్స్ 2.0 లో ఒక జోడిగా పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం అద్భుతంగా డాన్స్ చేసి మెస్మరైజ్ చేశారు వీరు. నయని – యావర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే ఊహించని విధంగా నయని షో నుంచి తప్పుకుంది. యావర్ కి షాక్ ఇచ్చింది. నయని పావని నీతోనే డాన్స్ సడన్ గా మానేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అసలు నయని షో నుంచి ఎందుకు తప్పుకుంది అని ఆరా తీస్తున్నారు. అదే సమయంలో స్టార్ మా ఆమెను తప్పించింది అనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో నయని పావని కి ఫుల్ క్రేజ్ ఉంది. టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. పైగా నయని పావని మంచి డాన్సర్. గతంలో ఈ టీవీలో ప్రసారమైన ఢీ షో లో మెంటర్ గా వ్యవహరించింది. బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. హౌస్ లో ఉన్నది ఒక్క వారమే అయినా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యావర్ తో క్లోజ్ గా ఉంటుంది.

యావర్ తో కలిసి రీల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. ఇద్దరూ ఆఫ్ లైన్ కెమిస్ట్రీ పండిస్తూ రచ్చ చేశారు. దీంతో నయని – యావర్ జంట సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.దాంతో నీతోనే డాన్స్ 2.0 లో జోడిగా వచ్చారు. మొదటి వారం అద్భుతంగా డాన్స్ చేశారు. వాళ్ళ కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఈ వారం జరగబోయే ఎపిసోడ్ లో నయని లేదు. ఆ స్థానంలో యావర్ పక్కన డ్యాన్స్ చేసేందుకు బిగ్ బాస్ ఫేమ్ వాసంతి వచ్చింది.

అయితే నయని పావని తప్పుకోవడానికి అసలు కారణం ఆమె పర్సనల్ రీజన్స్ అని తెలుస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆమె షో నుంచి తప్పుకుంది. అంతేకాకుండా నయని చేతిలో పలు ఆఫర్స్ ఉన్నాయని అందుకే షో మానేసిందని టాక్. స్టార్ మా ఆమెను తొలగించింది అనడంలో నిజం లేదట. ఆమె మరలా రీ ఎంట్రీ ఇస్తుందనే వాదన కూడా ఉంది. వాసంతి – యావర్ ల జోడి కంటిన్యూ అవుతుందా? లేదంటే ఒకటి రెండు వారాల తర్వాత నయని వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. వాసంతి కూడా యావర్ కి జోడిగా సెట్ అయ్యింది. డాన్స్ కూడా అదరగొట్టేస్తుంది.

Neethone Dance 2.0 - Full Promo| Looking Like a Wow | Every Sat & Sun at 9 PM | Star Maa