https://oktelugu.com/

Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కి ఎలా వచ్చాడో తెలుసా..? ఇంత తతంగం నడిచిందా!

ఆది జబర్దస్త్ కి వచ్చిన కొత్తలో అదిరే అభి టీం లో స్కిట్స్ చేసేవాడు. ఆ తర్వాత టీం లీడర్ గా మారాడు. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, దొరబాబు లపై ఆది వేసే పంచులు మామూలుగా పేలేవి కావు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 31, 2024 / 03:12 PM IST

    Hyper Aadi

    Follow us on

    Hyper Aadi: హైపర్ ఆది అంటే మనకు టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. ఈ షో ద్వారా హైపర్ ఆది చేసిన సంచలనాలు అన్నీ ఇ న్నీ కావు. నాన్ స్టాప్ పంచులు వేస్తూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సెట్ చేసుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు. బుల్లితెర స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అయితే హైపర్ ఆది బాగా చదువుకున్నాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చక్కగా జాబ్ చేసుకుంటున్న హైపర్ ఆది జబర్దస్త్ లోకి రావడానికి కారణం ఏంటో? ఎలా వచ్చాడో? ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

    ఆది జబర్దస్త్ కి వచ్చిన కొత్తలో అదిరే అభి టీం లో స్కిట్స్ చేసేవాడు. ఆ తర్వాత టీం లీడర్ గా మారాడు. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, దొరబాబు లపై ఆది వేసే పంచులు మామూలుగా పేలేవి కావు. ముఖ్యంగా రైజింగ్ రాజు, ఆది కాంబినేషన్ ఓ రేంజ్ లో నవ్వులు పూయించింది. వరుసగా స్కిట్లు కొడుతూ సెన్సేషన్ సృష్టించారు. ఆ పాపులారిటీతో తో సినిమాల్లో కూడా హైపర్ ఆది క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. అయితే హైపర్ ఆది జబర్దస్త్ కి రావాలని అనుకోలేదట.

    తాను జబర్దస్త్ కి ఎలా వచ్చాడో హైపర్ ఆది వివరిస్తూ .. నాకు పక్క వాళ్ళని నవ్వించడం ఇష్టం. కూర్చుని చేసే జాబ్ బోర్ కొట్టేసింది. నలుగురిని నవ్వించడానికి జబర్దస్త్ వేదిక అనిపించింది. అత్తారింటికి దారేది మూవీ స్పూఫ్ చేసి యూట్యూబ్ లో పెడితే వేల వ్యూస్ వచ్చాయి. ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే .. అదిరే అభి చూసి చాలా బాగా చేశావ్ బ్రదర్ అన్నాడు. ఒకసారి కలవమన్నాడు. అభి ని కలిశాను. జబర్దస్త్ కమెడియన్స్ తో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తే .. వందల లైక్స్ వచ్చాయి .

    కేవలం ఫోటోలు పోస్ట్ చేస్తేనే ఇంత మంది లైక్ చేశారు. వాళ్ళతో కలిసి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అప్పుడు జబర్దస్త్ కి వచ్చాను అని హైపర్ ఆది తెలిపాడు. కాగా ప్రస్తుతం ఆది ఢీ, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలు చేస్తున్నాడు. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాడు. ఇకపోతే ఆది స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. ఈ క్రమంలో తరచుగా సోషల్ మీడియాలో అతని పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. మల్లెమాల టీం హైపర్ ఆది పెళ్లి అంటూ పలు ఈవెంట్లు కూడా నిర్వహించడం విశేషం.