Vishnu Vinyasam OTT release: సంక్రాంతికి తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బాగా డల్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. కానీ శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ గా నిల్చింది. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ శ్రీవిష్ణు కి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉండడం వల్ల ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్ వరకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.
శ్రీవిష్ణు సినిమాలకు థియేటర్స్ లో ఎలాంటి ఫలితం వచ్చినా, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఆయన గత చిత్రం ‘సింగిల్ ‘ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆయన సినిమాలన్నిటినీ అమెజాన్ ప్రైమ్ సంస్థనే మొదటి నుండి కొనుగోలు చేస్తూ వచ్చింది. ‘విష్ణు విన్యాసం ‘ చిత్రాన్ని కూడా ఆ సంస్థనే కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాతే ఓటీటీ లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి. కానీ అనుకున్న తేదికంటే ముందుగా విడుదల చేస్తే భారీ అమౌంట్ ఇస్తామని ఆఫర్ పెట్టారో ఏమో తెలియదు కానీ, కేవలం మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ చిత్రాన్ని భారీ రేంజ్ లో ఎలాగో చూడలేదు కాబట్టి, ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కళ్యాణ్ కెరీర్ లో చివరి కమర్షియల్ సినిమా కానుందా?
మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం లో హీరోయిన్ గా నయన్ సారిక నటించింది. సినిమా స్టోరీ లైన్ డిఫరెంట్ గా ఉంటుంది, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కూడా అనేక సన్నివేశాల్లో బాగానే పేలింది. కానీ స్క్రీన్ ప్లే కాస్త తేడా కొట్టడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే విడుదలకు ముందే ఈ చిత్రం పైరసీ ద్వారా ఫస్ట్ హాఫ్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది. నిర్మాత సినిమా పరిస్థితి ఏమవుతుందో అని చాలా భయపడ్డాడు కానీ, ఎబోవ్ యావరేజ్ ఫలితం తో , ఎలాంటి నష్టం లేకుండా బయటపడ్డాడు నిర్మాత.
