Rajamouli: అప్ కమింగ్ డైరెక్టర్స్ రాజమౌళి ని ఢీ కొట్టాలంటే ఈ విషయాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి…

ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా రాజమౌళి సినిమాని బీట్ చేయలేకపోవడానికి కారణం కూడా అదే... ఎన్ని వందల కోట్ల సినిమాలు తీసిన అది ప్రేక్షకుడికి నచ్చితేనే వాడు రిపీటెడ్ గా ఆ సినిమాను చూడడానికి థియేటర్ కి వస్తాడు.

Written By: Gopi, Updated On : July 6, 2024 10:05 am

Rajamouli

Follow us on

Rajamouli: కొంతమంది దర్శకులు చేసినవి కొన్ని సినిమాలే అయిన వాళ్ళ సినిమాలతో దేశం మొత్తానికి గుర్తుండి పోతారు. ఇక వాళ్లలో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబు తో చేస్తున్న సినిమా కోసం సర్వం రెడీ చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఇలాంటి స్టార్ డైరెక్టర్ ను ఢీ కొట్టాలి అంటే నిజంగా నార్మల్ డైరెక్టర్లకైతే వర్కౌట్ అవదు. ఎందుకంటే ఆయనతో పోటీ పడాలంటే సినిమాలో ఎమోషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించే కెపాసిటీ ఉండాలి, అలాగే హీరో క్యారెక్టర్ ని ఎలివేషన్స్ తో నింపేయగలగాలి, ఇక సినిమా లో ఉన్న కోర్ ఎమోషన్ ని మొదటి నుంచి చివరి వరకు తీసుకెళ్లగలిగే ఘట్స్ ఉండాలి. యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా కొత్తగా డిజైన్ చేసుకునే సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్లు మాత్రమే రాజమౌళి తో పోటీ పడగలరు అనేది మాత్రం వాస్తవం…

ఎందుకంటే ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా రాజమౌళి సినిమాని బీట్ చేయలేకపోవడానికి కారణం కూడా అదే… ఎన్ని వందల కోట్ల సినిమాలు తీసిన అది ప్రేక్షకుడికి నచ్చితేనే వాడు రిపీటెడ్ గా ఆ సినిమాను చూడడానికి థియేటర్ కి వస్తాడు. దానివల్ల రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. దాంతో సినిమా కలెక్షన్స్ కూడా బాగా పెరుగుతుంటాయి. ఇక ఎక్కువ రోజులపాటు థియేటర్లో ఆడుతుంది. నిజానికి రాజమౌళి సినిమాల్లో ఆయన పెద్దగా మ్యాజిక్ అయితే ఏమీ చేయడు.

కానీ ఆయన చూపించే విధానం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు తన మైండ్ లో ఏదైతే ఉందో అది వచ్చేంతవరకు టెక్నీషియన్స్ ని ఇబ్బంది పెట్టైన సరే తనకు కావాల్సిన ఔట్ పుట్ ను రాబట్టుకుంటాడు. ఇక ఇప్పుడప్పుడే రాజమౌళి ని ఢీకొట్టే దర్శకుడు ఇండియాలో మరొకరు రాలేరు అనేది మాత్రం వాస్తవం…