Bharateeyudu 2: భారతీయుడు 2 సక్సెస్ అయితే శంకర్ భారీ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారా..?

Bharateeyudu 2: ప్రస్తుతం శంకర్ చేసిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా సక్సెస్ అయితే...

Written By: Gopi, Updated On : July 6, 2024 10:06 am

Bharateeyudu-2

Follow us on

Bharateeyudu 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో భారీ చిత్రాలను తీయగలిగే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ శంకర్…ప్రస్తుతం శంకర్ చేసిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా సక్సెస్ అయితే శంకర్ తన రాబోయే సినిమాలను నెక్స్ట్ లెవెల్లో తీయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే తెలుగులో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో తను మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అలాగే శంకర్ యూనివర్స్ కింద ఆయన ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నింటినీ కూడా ఒక సినిమాలో కలపబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి కథను కూడా తను రెడీ చేసి పెట్టుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ముగిసిన తర్వాత ఆయన తెలుగులో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేస్తారనే వార్తలైతే వస్తున్నాయి.

ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే తెలుగులో ఉన్న ఇద్దరు హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్ కూడా మల్టీస్టారర్ సినిమాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా చేస్తేనే ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఎక్కువగా సినిమాను ఆదరించి భారీ కలెక్షన్లు రాబడతారనే ఉద్దేశ్యంతో శంకర్ అలా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు రాజమౌళికి పోటీని ఇచ్చే దర్శకుడు ఎవరు లేరని మనం అనుకుంటున్నాం. కానీ శంకర్ తనకు పోటీని ఇస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఆ ఉద్దేశ్యం తోనే ఇప్పుడు భారతీయుడు 2, గేమ్ చేంజర్ రెండు సినిమాలతో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…