Upasana: చిత్ర పరిశ్రమలో వారసత్వం చాలా కామన్. తమ అభిమాన హీరో నట వారసత్వం కొనసాగాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారు. నెపోటిజం అని కొందరు విమర్శించినప్పటికీ జనాల ఆమోదం ఉంది కాబట్టి తప్పులేదు. తెలుగు చిత్రసీమను దశాబ్దాలు ఏలిన చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ టాప్ స్టార్స్ లో ఒకడిగా ఎదిగాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఫేమ్ మరింత పెరిగింది. గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాగా రామ్ చరణ్ చాలా ఆలస్యంగా పిల్లల్ని కన్నారు.
2012లో ఉపాసన కామినేనితో రామ్ చరణ్ కి వివాహం జరిగింది. ఏళ్ళు గడిచినా వీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఉపాసన, చరణ్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు 2023లో ఉపాసన -చరణ్ తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేరు క్లిన్ కార. అయితే మెగా ఫ్యాన్స్ కి ఒక అసంతృప్తి ఉంది. రామ్ చరణ్ కి ఒక నటవారసుడు కావాలి. కాబట్టి అబ్బాయి కూడా ఉంటే బాగుండు అని భావిస్తున్నారు.
వారి కోరిక తీరే అవకాశం త్వరలోనే ఉందని ఉపాసన గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ చైల్డ్ ని వెంటనే ప్లాన్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ… నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలా కాదు. సెకండ్ చైల్డ్ ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నాను… అని వెల్లడించారు.
ఉపాసన కామెంట్స్ నేపథ్యంలో ఈసారి రామ్ చరణ్ కి వారసుడు పుట్టడం ఖాయం అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లిన్ కార పుట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు. జూన్ 20న క్లిన్ కార అపోలో ఆసుపత్రిలో జన్మించింది. క్లిన్ కారను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. క్లిన్ కార గదిని ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. క్లిన్ కార కేర్ టేకర్ కి నెలకు రూ. 1.5 లక్షలు జీతం ఇస్తున్నారని సమాచారం. క్లిన్ కార ఫోటో మెగా ఫ్యామిలీ ఇంకా రివీల్ చేయలేదు.