Homeఎంటర్టైన్మెంట్Unstoppable With NBK: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!

Unstoppable With NBK: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!

Unstoppable With NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. బాలకృష్ణ చేస్తున్న ఈ షోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పలువురు సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులకు కొత్త బాలకృష్ణను పరిచయం చేస్తున్నాడు.

interesting news about balayya unstoppable show next guest

ఈ సంక్రాంతి కోసం ‘ఆహా’ టీం స్పెషల్ కార్యక్రమాలను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి రోజున ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమానికి ‘లైగర్’ టీం గెస్ట్ గా రాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రొమోను ‘ఆహా’ తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల 36సెకన్ల నిడివితో విడుదలైన ‘అన్ స్టాబుల్’ ప్రొమో వీక్షకులను ఎంతగానోఆకట్టుకుంటోంది.

బాలకృష్ణ మార్క్ కామెడీ, వ్యాఖ్యానంతో ‘అన్ స్టాబుల్’ సంక్రాంతి ప్రోమో అదిరిపోయింది. ముందుగా బాలకృష్ణ ఎంటరై.. ‘మాటల గన్.. మన జగన్’ అంటూ పూరీ జగన్నాథ్ ను ఆహ్వానించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ మూవీ గురించి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ను బాలకృష్ణ గుర్తు చేస్తూ నవ్వులు పూయించారు.

ఆ తర్వాత హీరోయిన్ ఛార్మి గురించి మాట్లాడుతూ.. ఆమెను తొలిసారి ‘అల్లరి పిడుగు’ సమయంలో కలిసానని.. ఇప్పుడు పిడుగులా అయ్యావంటూ ఛార్మిపై సైటర్ వేయడం నవ్వులు పూయించింది. ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి’ అంటూ విజయ్ దేవరకొండను షోలోకి బాలయ్య ఆహ్వానించారు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్ పెక్టర్.. అసలు నువ్వు ఎలా రౌడీ అని ఫిక్స్ అయ్యావంటూ విజయ్ దేవరకొండని’ ప్రశ్నించాడు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ‘ఆహా’లో సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

3 COMMENTS

  1. […] Lata Mangeshkar: భారత్ లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన రెండుమూడ్రోజులుగా దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు నెలకొనడంతో ప్రతీఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. […]

  2. […] Covid Cases in USA: అగ్రరాజ్యం అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచంలో ఇక కరోనా మహమ్మారి అంతం అయిందని అనుకునే లోపే మరో నూతన వేరియంట్ పుట్టుకొస్తుంది. తాజాగా ఒమిక్రాన్, డెల్ట్రాక్రాన్ పేరిట వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఈ వేరియంట్స్ కేసులు భారత్ తో పాటు అగ్రరాజ్యం అమెరికాలోనూ పెరుగుతున్నాయి. అలా కొవిడ్ బారిన పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరుతుండటంతో ఆస్పత్రులపైన తీవ్ర ఒత్తడి పడుతోంది. అలా మరోసారి ఆస్పత్రులపైన ఒత్తిడి పెంచుతోంది అమెరికా. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular