Mahesh Babu Mother Indira Devi: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం కన్నుమూశారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. మొదటి కూతురు పద్మావతి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను వివాహమాడారు. రెండో కూతురు మంజుల సినీ నటుడు సంజయ్ స్వరూప్ ను పెళ్లి చేసుకున్నారు. మూడో అమ్మాయి ప్రియదర్శిని సినీ నటుడు సుధీర్ బాబుని పెళ్లి చేసుకున్నారు. వీరందరి కంటే పెద్దవాడైన రమేష్ బాబు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. వీరందరిలో చిన్నవాడు మహేష్ బాబు. ఆయన నమ్రత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి సితార, గౌతమ్ సంతానం.

– ముసలి మడుగు తో సంబంధం ఏంటంటే
కృష్ణ సతీమణి ఇందిరా దేవి స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. అయినప్పటికీ ఆ రోజుల్లోనే ఉన్నత చదువులు చదివారు. అప్పట్లో కృష్ణ సినిమాలోకి రాకముందే ఇందిరా దేవితో వివాహం నిశ్చయించారు. ఫలితంగా కృష్ణ ముసలిమడుగు గ్రామం అల్లుడయ్యారు. అనంతరం కృష్ణ సినిమా హీరోగా నిలదొక్కుకున్నారు. ఆ రోజుల్లో మూడు షిఫ్ట్ ల్లో కృష్ణ పనిచేసేవారు. అయితే మహేష్ బాబు చిన్నప్పుడు ముసలిమడుగు గ్రామానికి వచ్చేవారు. అందరికంటే చిన్నవాడు కావడంతో మహేష్ బాబును ఇందిరా దేవి అమ్మ గారాబం చేసేవారు. వేసవి సెలవుల్లో ఎక్కువ శాతం మహేష్ బాబు ఇక్కడే గడిపేవారు. ఇందిరా దేవి కూడా అప్పుడప్పుడు ముసలిమడుగు వచ్చేవారు. వచ్చినప్పుడు ఇక్కడి గ్రామస్తులతో కలివిడిగా మాట్లాడేవారు. చాలామంది గిరిజన పిల్లలకు చదువుకునేందుకు సాయం చేసేవారు. పెళ్లిళ్లప్పుడు నూతన వస్త్రాలు అందజేసేవారు. ఆ మధ్య గ్రామంలో పాఠశాల అభివృద్ధికి సహాయం చేశారని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆమె మరణంతో ముసలిమడుగు వాసులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Also Read: Hero Nandu: గీతామాధురి భర్తకు ఏమైంది..? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నందు, షాక్ లో ఫ్యాన్స్!
– వరుస మరణాలు
కృష్ణ కుటుంబాన్ని కొన్నేళ్లుగా విషాదాలు చుట్టుముడుతున్నాయి. కృష్ణ రెండో భార్య విజయనిర్మల అనారోగ్యంతో కన్నుమూశారు. ఇది జరిగిన ఏడాది తర్వాత కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాదం నుంచి ఆ కుటుంబం కోలుకోక ముందే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్యంతో కాలధర్మం చేశారు. కాగా ఇటీవల కృష్ణంరాజు అనారోగ్యంతో మృతిచెందగా.. ఆయన పార్థివ దేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. తన ఆప్తుల మరణాలు ఇంకా ఎన్ని చూడాలని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారు.

వాస్తవానికి కృష్ణ, కృష్ణం రాజు ఇద్దరు మంచి స్నేహితులు. ఆయన విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నప్పుడు కృష్ణంరాజు వారించారు. తర్వాత కృష్ణ నిర్ణయాన్ని సమ్మతించి, ఇందిరా దేవికి సర్ది చెప్పారు. కృష్ణకు, కృష్ణంరాజుకు ఏరా అని పిలుచుకునే సాన్నిహిత్యం ఉంది. ఇటు మొదటి భార్య, రెండో భార్య కన్ను మూయడంతో కృష్ణ ఒంటరి వారయ్యారు. కృష్ణ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతుండడంతో “మహేష్ అన్న మీకు మేమున్నామంటూ” అభిమానులు ధైర్యం చెబుతున్నారు. కాగా ఇందిరా దేవి అంత్యక్రియలు గురువారం హైదరాబాదులోని ఫామ్ హౌస్ లో నిర్వహించనున్నారు. ఇందిరా దేవి మరణ వార్త విని టాలీవుడ్ ప్రముఖులంతా కృష్ణ నివాసానికి చేరుకున్నారు. ఇందిరా దేవికి అంజలి ఘటించి, కృష్ణను ఓదార్చుతున్నారు.
Also Read:Chiranjeevi- Ram Charan- Pawan Kalyan: ఒకే రూట్లో చిరంజీవి, రామ్ చరణ్.. ఇపుడు పవన్ కళ్యాణ్
[…] […]