Hero Nandu: స్టార్ సింగర్ గీతా మాధురి భర్త నందు గుర్తు పట్టలేనంతగా తయారయ్యాడు. అతని లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. బక్కపల్చగా మారిపోయిన నందుని చూసి ఈయనకు ఏమైందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. 2006లో విడుదలైన ఫోటో చిత్రంతో నందు నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 100% లవ్ మూవీతో నందుకు ఫేమ్ వచ్చింది. ఆ మూవీలో నాగ చైతన్యకు చదువులో పోటీ ఇచ్చే స్టూడెంట్ గా నందు నటించాడు. 100% లవ్ మూవీ విజయం సాధించిన నేపథ్యంలో నందు వెలుగులోకి వచ్చాడు.

హీరోగా ఎదగాలనుకున్న నందుకు బ్రేక్ రాలేదు. స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ మాత్రమే ఎక్కువగా దక్కాయి. హీరోగా చేసిన స్మాల్ బడ్జెట్ చిత్రాలు ఆయనకు ఫేమ్ తేలేకపోయాయి. నందుకు సక్సెస్ దక్కక రేసులో వెనకబడిపోయారు. నందు హీరోగా 2020లో సవారీ టైటిల్ తో ఓ మూవీ విడుదలైంది. ఈ చిత్రం సైతం నిరాశపరిచింది. నందుకు హిట్ దక్కలేదు. ఇటీవల విడుదలైన షెహరి మూవీలో నందు ఓ కీలక రోల్ చేశారు.
Also Read: Chiranjeevi- Ram Charan- Pawan Kalyan: ఒకే రూట్లో చిరంజీవి, రామ్ చరణ్.. ఇపుడు పవన్ కళ్యాణ్
కాగా నందు లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. అతడు పూర్తి బక్కపలచగా తయారయ్యాడు. ఆరడుగుల ఎత్తు, హైట్ కి తగ్గ వెయిట్ తో సాలిడ్ గా ఉండే నందు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. మునుపటి బరువులో సగమైపోయాడు. నందు కావాలనే బరువు తగ్గడం జరిగింది. అతడు సిక్స్ ప్యాక్ బాడీ డెవలప్ చేశాడు. ఇదంతా నందు ఓ పాత్ర కోసం చేశారట. బరువు తగ్గితే సినిమా అవకాశం ఉందని ఒకరు ఆఫర్ చేయడంతో నందు తనని తాను ఇలా మార్చుకున్నట్లు సమాచారం. అయితే నందు లేటెస్ట్ లుక్ పట్ల మెజారిటీ జనాలు పెదవి విరుస్తున్నారు.

నందు బొద్దుగా ఉంటేనే బాగున్నారు. బక్కచిక్కిన ఈ లుక్ ఆయనకు సెట్ కాలేదంటున్నారు. కాగా నందు 2014లో సింగర్ గీతా మాధురిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది. గీతా మాధురి బిగ్ బాస్ తెలుగు 2 లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె టైటిల్ రన్నర్ గా నిలిచారు. కౌశల్ టైటిల్ గెలవగా గీతా మాధురి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ సమయంలో నందు ఆమెకు మంచి సప్పోర్ట్ ఇచ్చారు. మరి రోల్ కోసం ఇంత కష్టపడిన నందు కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
Also Read: Mahesh Babu Mother Passes Away: మహేష్ బాబు తల్లి మృతి: చిరంజీవి సహా సినీ ప్రముఖుల సంతాపం
[…] […]