Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Trivikram Srinivas: రూటు మార్చిన త్రివిక్రమ్...ఆ స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడా..?

Trivikram Srinivas: రూటు మార్చిన త్రివిక్రమ్…ఆ స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడా..?

Trivikram Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఒకప్పుడు ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించేవి. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఇప్పుడు ఎందుకు వెనకబడి పోతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ప్లాప్ అవడంతో ఆయనకు ఇండస్ట్రీలో బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది.

ఇక ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని త్రివిక్రమ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక దీంతో తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య ను త్రివిక్రమ్ లైన్ లో పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సూర్య హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇంతకుముందే ఒక సినిమా వస్తుందని అనుకున్నప్పటికీ అది అనుకోని కారణాలవల్ల పోస్ట్ పోన్ అయింది.

ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరొక హీరోకి కూడా స్కోప్ ఉందట. ఆ ఇంకో హీరో ఎవరు అంటే కెజీఎఫ్ సినిమా తో సూపర్ సక్సెస్ అందుకున్న యశ్..ఈ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ ఒక మల్టీస్టారర్ సినిమాని చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన మార్కెట్ అనేది మరింతగా పెరుగుతుంది. లేదంటే మాత్రం ఆయన మార్కెట్ పడిపోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇక ఆయనకి అవకాశాలు ఇచ్చే స్టార్ హీరోలు కూడా కరువవుతారు…

ఇక త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు హీరో కోసం వెతుక్కునే సందర్భం రావడం అనేది ఆయన అభిమానులకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం క్యూ కట్టేవారు… మరి ఇప్పటికైన తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version