https://oktelugu.com/

Tollywood Directors: తెలుగు లో షార్ట్ టెంపర్ ఉన్న డైరెక్టర్స్ వీళ్లే…షూటింగ్ లో వీళ్లని గెలికితే రచ్చ రాంబోలానే…

అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న సందీప్ రెడ్డివంగాకి బేసిగ్గా షార్ట్ టెంపర్ ఉంటుంది. ఆయనతో ఎవరైనా అడ్డ దిడ్డంగా వాదించిన, ఆయన్ని ఇరిటేట్ చేసిన ఆయనకి ఈజీగా కోపం వచ్చేస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 17, 2024 / 05:44 PM IST

    Tollywood Directors

    Follow us on

    Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలంటే ఆ సినిమా దర్శకుడికి సినిమాల పట్ల చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇక సినిమాల పరంగా ఆయనకు అన్నీ విషయాలు తెలిసి ఉన్నప్పుడే ఆ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించగలుగుతాడు.

    అలా కాకుండా సినిమా మీద ఏ మాత్రం అవగాహన లేకుండా సినిమాని తీయాలనుకుంటే మాత్రం సినిమా డిజాస్టర్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇలాంటి క్రమంలోనే మన దర్శకులు ఒక సినిమా చేసే టైంలో వాళ్ళు డిఫరెంట్ మూడ్ లో ఉంటారు. కాబట్టి మధ్యలో ఎవరైనా వెళ్లి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా ఫైర్ అవుతూ ఉంటారు. అలా మన ఇండస్ట్రీలో షార్ట్ టెంపర్ ఉన్న డైరెక్టర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    సందీప్ రెడ్డి వంగ
    అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న సందీప్ రెడ్డివంగాకి బేసిగ్గా షార్ట్ టెంపర్ ఉంటుంది. ఆయనతో ఎవరైనా అడ్డ దిడ్డంగా వాదించిన, ఆయన్ని ఇరిటేట్ చేసిన ఆయనకి ఈజీగా కోపం వచ్చేస్తుంది. ముందు అవతలి వాళ్ళని మాటలతో కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడట. అయినా కూడా వాళ్ళు వినకపోతే మాత్రం తన చేతలను చూపిస్తాడంటూ తన సన్నిహితులు చెబుతూ ఉంటారు…

    హను రాఘవపూడి
    ఈయన తీసిన సినిమాల్లో ‘సీతారామం ‘ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయనకు దర్శకుడిగా ఒక మంచి పేరును కూడా తీసుకొచ్చింది. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తోనే ఇప్పుడు ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడికి కూడా చాలావరకు షార్ట్ టెంపర్ ఉంటుందని ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే ఆయన సినిమా మూడ్ లో ఉన్నప్పుడు ఏదైనా అనవసరపు ముచ్చట్లు చెప్తే చాలు ఆయనకి ఈజీగా కోపం వస్తుందట…

    అజయ్ భూపతి
    ఆర్ఎక్స్ 100 తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అజయ్ భూపతికి కూడా షార్ట్ టెంపర్ ఉంటుందని తెలుస్తుంది. ఇంక సినిమా షూటింగ్ టైంలో ఎవరైనా ఇరిటేట్ చేస్తే మాత్రం వాడు చచ్చాడే అన్నట్టుగా ఉంటుందట. ఇక ఇది ఇలా ఉంటే ఒక దర్శకుడు సినిమా కోసం ఎంత ఎఫర్ట్ అయిన పెట్టడానికి రెడీగా ఉంటాడు.కాబట్టి వాళ్లని అలాంటి సమయంలో డిస్టర్బ్ చేస్తే కోపం రావడం లో తప్పులేదు అంటూ వాళ్ళవైపు సమర్థించి మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు…