Trivikram Srinivas: రామ్ తో పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రివిక్రమ్…

మరి ఈ సినిమా నా వల్లే ప్లాప్ అయిందని తను ఒప్పుకున్నాడు. ఇక దాంతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే సరి కొత్త సబ్జెక్టుతో అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ తో కూడా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : May 10, 2024 8:17 am

Trivikram Srinivas

Follow us on

Trivikram Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్…ఈయన ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే తను పాన్ ఇండియాలో సత్తా చాటుకుంటాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన చేసిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయింది.

మరి ఈ సినిమా నా వల్లే ప్లాప్ అయిందని తను ఒప్పుకున్నాడు. ఇక దాంతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే సరి కొత్త సబ్జెక్టుతో అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ తో కూడా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక వీళ్ళ కాంబో లో ఇంతకుముందే ఒక సినిమా అనౌన్స్ అయితే అయింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఈయనకి స్రవంతి రవి కిషోర్ తో ఉన్న సంబంధం చాలా గొప్పది. కాబట్టి రామ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక స్రవంతి రవి కిషోర్ రామ్ వాళ్ళ పెదనాన్న అనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం రామ్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ తో సినిమాని పట్టా లెక్కించే పనిలో త్రివిక్రమ్ అయితే ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో రామ్ నటించడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాని తొందరగానే పట్టాలెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇంకా ఇప్పటికే దర్శకులందరు పాన్ ఇండియా లో వాళ్ల సత్తా చాటుతుంటే త్రివిక్రమ్ మాత్రం తెలుగుకి మాత్రమే పరిమితమవుతున్నాడు. తను పాన్ ఇండియాలో సినిమాలు చేయడానికి పనిచేయడా… తన సినిమాలు తెలుగు వరకే పరిమితం అవ్వాల్సిందేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…