Trisha And Nayanthara: స్టార్ లుగా మారితే చాలు భారీ రెమ్యునరేషన్ లు వద్దన్నా వస్తాయి. కానీ స్టార్లుగా ఎదగడానికి ఏ రేంజ్ లో కష్టపడాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో.. మళ్లీ ఎలా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతారో ఊహకు అందదు. అయితే హీరోయిన్ త్రిష గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది ఈ అమ్మడు. గతంలోనే స్టార్ హీరోల అందరి సరసన నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ మళ్లీ రీ ఎంట్రీతో దూసుకొని పోతుంది.
హీరోల మాదిరిగానే హీరోయిన్ లకు కూడా భారీ రెమ్యూనరేషన్ లు అందుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార. ఈమెను క్రాస్ చేసిన హీరోయిన్ లేదు. రీసెంట్ గా జవాన్ సినిమాతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. ప్యాన్ ఇండియా సినిమాతో తన సూపర్ నటనతో దేశ నలుమూలల నుంచి అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కంటే త్రిష ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకోబోతుంది అనే టాక్ వస్తుంది.
నయనతార రెమ్యునరేషన్ భారీగా ఉన్నా కూడా ఆమెను బీట్ చేసే హీరోయిన్ రాదని టాక్ ఉండేది. జవాన్ సినిమాకు ఈ అమ్మడు ఏకంగా రూ. 10 కోట్లు అందుకుందట. ఇపుడే కాదు మొదటి సారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న సౌత్ స్టార్ గా గుర్తింపు పొందిన నటి కూడా నయనతారనే. ఇక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న త్రిష విశ్వంభర సినిమాకు రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే నయనతార రికార్డును త్రిష బ్రేక్ చేసినట్టే.
విశ్వంభర టీమ్ త్రిషకు భారీ ఆఫర్ ను ఇచ్చారు. ఈ సోషల్ ఫాంటసీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించబోతుంది త్రిష. అయితే వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం చేయబోతోందట. సినిమా కోసం ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కూడా పూర్తి చేసిందట. ఇక యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో దిగనుంది అని టాక్. కొన్ని సంవత్సరాల తర్వాత మరోసారి జతకడుతున్న ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.