https://oktelugu.com/

Bharateeyudu 3: ఇండియన్ 3 లో సేనాపతి ని పట్టుకోవడానికి రెడీ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరో…

భారతీయుడు 2 సినిమాకి అనుకున్నంత సక్సెస్ టాక్ అయితే రాలేదు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి ఆ పాత్రను చేస్తాడా? లేదంటే వదిలేస్తాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఎప్పటినుంచో చిరంజీవి శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో శంకర్ తో సినిమా చేసి సక్సెస్ కొడతాడా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారతీయుడు 2 సినిమాలో కమలహాసన్ ను పట్టుకోవడానికి బాబీ సింహా ను పోలీస్ ఆఫీసర్ గా నియమించారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 12:49 PM IST

    Bharateeyudu 3

    Follow us on

    Bharateeyudu 3: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి దర్శకులు తీవ్రమైన కసరత్తులను చేస్తూ మంచి కథతో ప్రేక్షకులను మెప్పించడానికి భారీ ఎఫర్ట్ పెడతారు. ఇక ఇలాంటి క్రమంలోనే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా అనుకున్న రేంజ్ లో లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక దీనికి తోడుగా ఈ సినిమా ఎండింగ్ లో భారతీయుడు 3 కి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక దాన్ని బట్టి చూస్తే భారతీయుడు 3 సినిమాలో సేనాపతిని పట్టుకునే క్యారెక్టర్ లో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడా అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం భారతీయుడు 3 లో మెగాస్టార్ చిరంజీవి కమలహాసన్ ను పట్టుకునే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ఇక ఆయన పాత్ర నిడివి 15 నుంచి 20 నిమిషాల వరకు ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    మరి భారతీయుడు 2 సినిమాకి అనుకున్నంత సక్సెస్ టాక్ అయితే రాలేదు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి ఆ పాత్రను చేస్తాడా? లేదంటే వదిలేస్తాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఎప్పటినుంచో చిరంజీవి శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో శంకర్ తో సినిమా చేసి సక్సెస్ కొడతాడా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారతీయుడు 2 సినిమాలో కమలహాసన్ ను పట్టుకోవడానికి బాబీ సింహా ను పోలీస్ ఆఫీసర్ గా నియమించారు. అయినప్పటికీ ఆయన క్యారెక్టర్ లో అంత దమ్ము అయితే లేదు. కాబట్టి నెక్స్ట్ పార్ట్ లో చిరంజీవి ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి ఆ పాత్ర చేస్తాడా లేదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో విపరీతంగా ఉన్నాయి…

    ఇక ఇదిలా ఉంటే లాంగ్ రన్ లో భారతీయుడు 2 సినిమా కలెక్షన్లను రాబట్టకపోతే భారతీయుడు 3 సినిమా చేస్తారా లేదంటే దాన్ని కూడా ఆపేస్తారా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక భారతీయుడు 3 సినిమాను ఇప్పటికే దాదాపు 30% షూటింగ్ ను పూర్తి చేశారు. కాబట్టి దీన్ని ఆపే ప్రసక్తి అయితే లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అయితే శంకర్ రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీదనే మళ్లీ ఫోకస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటిదాకా రెండు సినిమాలను చేసుకుంటూ వచ్చిన శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఒక్క దానిమీదనే తన పూర్తి ఫోకస్ పెట్టి ఆ సినిమా పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ భారతీయుడు 3 సినిమా కోసం తను కష్టపడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో శంకర్ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…

    ఇక ఒకప్పుడు శంకర్ డైరెక్షన్ లో ప్రతి హీరో నటించాలి అనుకునేవాడు కానీ ఇప్పుడు శంకర్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని సినిమాలు చేసిన కూడా అందులో ఒకటి కూడా సక్సెస్ అయితే సాధించడం లేదు. మరి ఇలా ఎందుకు అవుతుంది అనే విషయాలను కూడా శంకర్ ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేస్తే బాగుంటుందంటూ సినీ మేధావులు వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…