Thiruveer Marriage: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు పెళ్లిళ్ల బాట పడుతున్నారు. మసుద, జార్జి రెడ్డి, పలాస 1978 లాంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు తిరువీర్… ఇక ఇప్పుడిప్పుడే ఈ నటుడు సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. అలాగే వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ఒక నటుడిగా కూడా రాణిస్తున్నాడనే చెప్పాలి. ఇక పరేషాన్ లాంటి సినిమాని కూడా చేసి తెలుగులో చాలా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తెలంగాణలోని గ్రామాల్లో ఉండే జనాల మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఆ సినిమాలో చాలా బాగా చేసి మెప్పించాడు.
ఇక ఇది ఇలా ఉంటే తిరువీర్ కరీంనగర్ కి చెందిన కల్పనా రావు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.తిరుమలలోని శ్రీవారి ఆశీస్సులతో వీళ్ల పెళ్లి జరగడం అనేది మంచి విషయమనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే కల్పన రావు కొద్ది రోజుల నుంచి సినిమా ఫీల్డ్ లోనే వర్క్ చేస్తూ తిరువీర్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక కొద్ది రోజులు గడిచిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది.
ఇక ఈ ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని తను తెలియజేసేదాకా ఎవరికి తెలియకపోవడం విశేషం…తిరువీర్ శ్రీవారి టెంపుల్లో సింపిల్ గా పెళ్లి చేసుకోవడం అనేది ఆయన ఫ్యాన్స్ కి కొద్దిగా వరకు నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, ఆయన ఇష్టపడ్డ కల్పనా రావు తో తిరువీర్ నూతన బంధానికి శ్రీకారం చుట్టడం అనేది మంచి విషయమనే చెప్పాలి.
ఇక ఈయన పర్సనల్ లైఫ్ పరంగా సెటిల్ అయినప్పటికీ చాలా మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని తను ముందుకు కదులుతున్నాడు. ఇక ఇప్పుడు తన కెరియర్ లో తనకు నచ్చిన అమ్మాయి తన వైఫ్ గా వచ్చింది. కాబట్టి ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టి తన సినీ కెరియర్ ను ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…