Rajinikanth-Balakrishna: రజినీకాంత్ సినిమాలో బాలయ్య మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఇదే…

జైలర్ సినిమాతో ఆయన భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ని దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన నెల్సన్ ఈ సినిమాతో ఆయనకు భారీ సక్సెస్ ని సాధించి పెట్టాడు.

Written By: Gopi, Updated On : March 4, 2024 2:48 pm

balakrishna-and-rajinikanth

Follow us on

Rajinikanth-Balakrishna: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అప్పుడున్న హీరోలేవరికి సాధ్యం కానీ విధంగా వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ ని సాధిస్తూ సూపర్ స్టార్ గా తన స్టార్ డమ్ ని విస్తరించుకున్న నటుడు రజనీకాంత్… ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్లో ఒక పెను సంచలనం గా మారేది. ముఖ్యంగా రజినీకాంత్ అంటే స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు… ఆయన ఏం చేసినా అదొక స్టైల్ గా మారిపోయేది, సిగరెట్ వెలిగించిన, కాయిన్ పైకి విసిరేసిన అలా ఆయన ఏం చేసిన చాలా స్టైల్ గా చేసేవాడు.

అందుకే ఆయన స్టైల్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. తమిళంలో దక్కిన సక్సెస్ లు ఆయనకు తెలుగులో కూడా దక్కడంతో తెలుగులో కూడా సూపర్ స్టార్ గా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమాతో(Jailer Movie) ఆయన భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ని దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన నెల్సన్ ఈ సినిమాతో ఆయనకు భారీ సక్సెస్ ని సాధించి పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో క్యామియో రోల్స్ పోషించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇద్దరూ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించారు. మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ నటించడమే కాకుండా తెలుగు నుంచి బాలయ్య బాబుతో క్యామియో రోల్ చేయించాలి అనుకున్నారు.

కానీ దానికి బాలయ్య ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరితోనే ఆ రోల్స్ చేయించి సినిమా సక్సెస్ లో వాళ్ళని భాగం చేశారు. ఆయన సాధించిన విజయంతో 70 సంవత్సరాల వయసులో కూడా రజనీకాంత్ ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్టుని కొట్టగలడు అని ప్రేక్షకుల్లో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక లోకేష్ ఇప్పటికే విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి ఒక అదిరిపోయే సక్సెస్ ని అందించాడు.ఇక ఇప్పుడు రజనీకాంత్ కి కూడా భారీ సక్సెస్ ని అందించాలని చూస్తున్నాడు…