https://oktelugu.com/

Rajamouli Vs Shankar: రాజమౌళి శంకర్ ఇద్దరి సినిమాల్లో ఉండే తేడాలు ఇవే…ఇంతకీ వీళ్లిద్దరి లో టాప్ డైరెక్టర్ ఎవరు..?

ఒకప్పుడు శంకర్ తన మ్యాజిక్ తో ప్రతి సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చేవాడు. కానీ ఇప్పుడు శంకర్ మ్యాజిక్ పనిచేయడం లేదు. అయినప్పటికీ ఆయన భారీతనం అయితే ఎక్కడ వదిలేయకుండా సినిమాని చాలా రిచ్ గా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి మాత్రం తన సినిమాని ఎక్కడ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ప్రతి సీన్ లో ఎలివేషన్ ను యాడ్ చేసుకుంటూ సినిమాలు తీయడంలో దిట్ట...అయితే ఈ ఇద్దరి దర్శకుల మధ్య ఉన్న తేడాని కనక మనం ఒకసారి గమనించినట్లైతే శంకర్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమా కథలను ఎంచుకోవడంలో మాత్రం చాలా వరకు వెనకబడి పోతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 11:39 am
    Rajamouli Vs Shankar

    Rajamouli Vs Shankar

    Follow us on

    Rajamouli Vs Shankar: ఒక సినిమా అనేది ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించాలి అంటే అది చాలా కష్టమైన పని…కానీ కొంతమంది దర్శకులు మాత్రం ప్రేక్షకుల నాడీ తెలుసుకొని వాళ్లకు ఎలాంటి సినిమాలైతే నచ్చుతున్నాయి. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం సినిమాని ఎలా తీయాలి అనే మెలకువలు తెలుసుకొని ఉంటారు. కాబట్టి అలాంటి దర్శకులు చేసే సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి కోవకు చెందిన వాళ్లలో రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు మొదటి స్థానంలో ఉంటారు.

    ఒకప్పుడు శంకర్ తన మ్యాజిక్ తో ప్రతి సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చేవాడు. కానీ ఇప్పుడు శంకర్ మ్యాజిక్ పనిచేయడం లేదు. అయినప్పటికీ ఆయన భారీతనం అయితే ఎక్కడ వదిలేయకుండా సినిమాని చాలా రిచ్ గా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి మాత్రం తన సినిమాని ఎక్కడ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ప్రతి సీన్ లో ఎలివేషన్ ను యాడ్ చేసుకుంటూ సినిమాలు తీయడంలో దిట్ట…అయితే ఈ ఇద్దరి దర్శకుల మధ్య ఉన్న తేడాని కనక మనం ఒకసారి గమనించినట్లైతే శంకర్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమా కథలను ఎంచుకోవడంలో మాత్రం చాలా వరకు వెనకబడి పోతున్నాడు. దానివల్ల ఆయన సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇక ఆయన ఎప్పటినుంచో తీస్తున్న కరప్షన్ కాన్సెప్ట్ ని ఎంచుకొని ఇప్పటికీ సినిమాలు తీయడం వల్ల ఆయనకు వచ్చే బెనిఫిట్ అయితే ఏమి లేదు.

    అయినా కూడా తను ఆ కాన్సెప్ట్ వదిలేయడం లేదు. దానివల్లే ఆయనకు చాలా వరకు ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మాత్రం తను ఎలాంటి కథను ఎంచుకున్న ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకొని అలాగే ఈ సినిమా ఇంటెన్స్ ని ప్రేక్షకుడికి ఎక్కించడంలో తను చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాడు. అందువల్లే సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ క్యారెక్టర్లతో పాటు మూవ్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడో అప్పుడు ఆ సినిమా సక్సెస్ అయినట్టు గా మనం భావించవచ్చు.

    ఎందుకంటే హీరో క్యారెక్టర్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఇక ఆ సినిమా మిస్ లీడ్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రేక్షకుడు హీరోని ఓన్ చేసుకున్నాడు అంటే ఇక అతను ఏం చేసిన కూడా ఆ సినిమాలో నుంచి బయటికి వచ్చే ప్రసక్తైతే లేదు. అదే మూడ్ లో అతను ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి రాజమౌళి ఆ స్ట్రాటజీని ఎక్కువగా వాడి ప్రేక్షకుడిని మ్యాజిక్ చేస్తూ తన సినిమాలను సక్సెస్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాడు…

    ఇక ఇంతకు ముందు శంకర్ కూడా ఇలాంటి ప్రాసెస్ ని ఎంచుకునేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేసే సినిమాలకి, స్టోరీలకి అసలు సంబంధం లేకుండా పోతుంది… అందుకే ఒకప్పటి శంకర్ మళ్లీ తిరిగి వస్తే గాని ఆయన అభిమానులు సంతోషపడేలా కనిపించడం లేదు. ఇక ఇండియన్ 2 సినిమాతో అయిన తను సక్సెస్ సాధిస్తాడు అనుకుంటే అది కూడా ప్రేక్షకుల్ని చాలా వరకు నిరాశపరిచిందనే చెప్పాలి…ఒకప్పుడు శంకర్ రాజమౌళి మధ్య పోటీ ఉంది అని అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు శంకర్ ను బీట్ చేసి రాజమౌళి నే టాప్ పొజిషన్ కి వెళ్తున్నాడు. దానికి కారణం శంకర్ నుంచి మంచి సినిమాలు రాకపోవడమే అంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…