The Girlfriend: గర్ల్ ఫ్రెండ్ కోసం నేషనల్ క్రష్ రష్మిక సాహసమే చేస్తోంది. దీంతో ఆమె వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అదేంటి రష్మికకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంటి? ఆమె అలాంటి పని ఎందుకు చేస్తుంది? అనేకదా మీ డౌటు.. కాకపోతే మేము రాసిన దాంట్లో ద్వంద్వార్థం ఏమీ లేదు. అల్లు అరవింద్ నిర్మాతగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో రష్మిక నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. ఆమధ్య ఈ సినిమా పోస్టర్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని కూడా చిత్ర యూనిట్ బయట పెట్టలేదు.
అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న నేపథ్యంలో.. రష్మిక ఒకేసారి ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిందట. ఆమె డబ్బింగ్ చెప్పిన తీరు అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ కొనియాడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య గ్లింప్స్ విడుదల చేశారు. అది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ ఈ సినిమా మేకర్స్ బయటకు విడుదల చేయలేదు. ముందుగా చెప్పినట్టే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. రష్మికకు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా నిర్మాత అల్లు అరవింద్ ఈ సాహసం చేస్తున్నారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో, హిందీలోనూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది. త్వరలో టీజర్ విడుదల కానుంది. అ టీజర్ లో ఓ డైలాగ్ ఉంది. ఆ డైలాగును రష్మిక తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో చెప్పి అదరగొట్టింది. మలయాళం కొంచెం విభిన్నమైన భాష కాబట్టి అందులో కొంచెం ప్రావీణ్యం సంపాదించిన తర్వాత రష్మిక డైలాగ్ చెప్పినట్టు చిత్ర యూనిట్ అంటుంది.
రష్మిక పుట్టినరోజు ఏప్రిల్ 5. ఆ సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విడుదల చేయనున్నారు. సినిమాకు రాహుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వయంగా కథను కూడా అతడే రాసుకున్నాడు. గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ఆయ్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరు మీదనే చిత్రీకరిస్తున్నారు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేని కథ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రాహుల్ చెబుతున్నారు. ఈ సినిమాపై రష్మిక భారీ అంచనాలు పెట్టుకుంది.
ఈ సినిమాలో ప్రధాన తారాగణం ఎవరు అనే విషయం గురించి ఇంతవరకు చిత్ర యూనిట్ బయట పెట్టలేదు. సినిమా షూటింగ్ కూడా వెంట వెంటనే జరిగిపోతోంది. షూటింగ్ దాదాపు పూర్తయిందని.. డిజిటల్ వర్క్ జరుగుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. రష్మిక ఇప్పటివరకు ఒక తరహా పాత్రలు మాత్రమే పోషించారని.. ఈ సినిమా తర్వాత ఆమె మార్కెట్ మరింత పెరుగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా విజయం పట్ల అటు రాహుల్, ఇటు అల్లు అరవింద్ గట్టి నమ్మకంతో ఉన్నారు. బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ రైట్స్ ఇంకా ఎవరికీ కేటాయించలేదని.. బహుశా ఆహాలో స్ట్రీమ్ కావచ్చనే టాక్ వినిపిస్తోంది.