Kalki 2898 AD: కల్కి సినిమాలో రెండు నిమిషాల పాటు కనిపించనున్న స్టార్ హీరో…

కల్కి సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : June 5, 2024 11:52 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: 2024 సమ్మర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాకపోవడం నిజంగా అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. ఇక దానికి చెక్ పెడుతూనే ఈనెల 27వ తేదీన కల్కి సినిమాతో పెద్ద సినిమాల జాతర మొదలవుతుంది. ఇక ఇప్పటికే కల్కి సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే కల్కి లాంటి ఒక భారీ గ్రాఫికల్ మూవీ ని తెరకెక్కించి తన సత్తా చాటుకోవాలని నాగ్ అశ్విన్ కూడా చాలా ఉర్రూతలూగుతున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక దాన్ని క్యాచ్ చేసుకోవడంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఇందులో అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా లో ఒక రెండు నిమిషాల పాటు తమిళం లో స్టార్ హీరో అయిన సూర్య కూడా నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయన పాత్ర ఏంటి అనేది ఇంకా బయటికి చెప్పడం లేదు కానీ ఒక రెండు నిమిషాల తన పాత్రకి కూడా సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అందువల్లే సూర్యని ఈ సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సూర్య ఉండటం వల్ల తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా మార్కెట్ భారీగా వర్కౌట్ అవుతుంది.

ఇక ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీ నుంచి కమలహాసన్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ ఆయన పోషించేది విలన్ పాత్ర కాబట్టి సూర్యని ఈ సినిమాలో తీసుకొని తన చేత ఒక మ్యాజిక్ చేయించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించాడట. అందువల్లే తన చేత ఈ క్యారెక్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఇక సూర్య గెస్ట్ ఆప్పిరియన్స్ ఇస్తే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా అదరగొట్టి అద్భుతాన్ని సృష్టించాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఇమేజ్ ని పొందుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…