Spirit: స్పిరిట్ సినిమా లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే..?

ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకి గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక అదే క్రమంలో స్పిరిట్ సినిమాను కూడా అలాంటి ఒక కేటగిరీలోకి తీసుకెళ్లి ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని తను ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : June 5, 2024 11:55 am

Spirit

Follow us on

Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకి గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక అదే క్రమంలో స్పిరిట్ సినిమాను కూడా అలాంటి ఒక కేటగిరీలోకి తీసుకెళ్లి ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని తను ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సందీప్ వంగా స్పిరిట్ సినిమా విషయంలో చాలావరకు చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా మిస్ అవ్వకుండా ప్రతీది లాజికల్ గా ఆలోచిస్తూ రాసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు కాబట్టి ఆయన పాత్రను చాలా కొత్తగా తీర్చిదిద్దాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో హీరోలందరూ చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లన్నిటిని పక్కన పెడుతూ ఈ క్యారెక్టర్ చాలా హైలెట్ అయ్యే విధంగా సందీప్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే సందీప్ తన మేకింగ్ తో ఈ సినిమాని మరొక బ్లాక్ బాస్టర్ గా మారుస్తాడని అటు సందీప్ అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు మంచి అంచనాలలైతే పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్న నేపథ్యంలో సందీప్ వంగ ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా సినిమా షూట్ స్టార్ట్ అయిన రెండు నెలల లోపే ఒక చిన్న గ్లింప్స్ ని కూడా వదిలి వాళ్ళందరికి ఆనందాన్ని పంచే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నాడట…ఇక మొత్తానికైతే ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాల లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మరి వీటిలో ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…