https://oktelugu.com/

Jack: టిల్లు హీరో, బేబీ హీరోయిన్ బిజీ బిజీ.. జాక్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది

టిల్లు స్క్వేర్ ఊహించిన దానికంటే భారీ విజయం సాధించడంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న జాక్ సినిమాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ వారం నుంచి సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 3, 2024 / 06:01 PM IST

    Jack

    Follow us on

    Jack: గత శుక్రవారం విడుదలైన టిల్లు స్క్వేర్ సంచలన విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నప్పటికీ.. టిల్లు ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పిస్తున్నాడు. పరీక్షలు కూడా ముగియడంతో యువత ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

    టిల్లు స్క్వేర్ ఊహించిన దానికంటే భారీ విజయం సాధించడంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న జాక్ సినిమాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ వారం నుంచి సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమా కామెడీ, క్రై* జోనర్ లో రూపొందుతోంది. టిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై సినీ వ్యాపార వర్గాల్లో మంచి ఆసక్తి ఉంది.. అయితే టిల్లు స్క్వేర్ భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రమోషన్లను విపరీతంగా చేస్తున్నారు. మరో 10 రోజులపాటు ఈ ప్రమోషన్లు ఇలాగే కొనసాగుతాయని తెలుస్తోంది. అందువల్లే సిద్దు జొన్నలగడ్డ ఆ ప్రమోషన్ల కోసమే ఎక్కువ డేట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా జాక్ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయడం ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది.

    జాక్ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటిస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ విడుదలైన తర్వాత ఆమె లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా ప్రమోషన్లలో భాగం కావలసి ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తన సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. దీనిపై విపరీతమైన నమ్మకంతో ఉన్నారు. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా సందడి తగ్గిన తర్వాత లవ్ మీ సినిమా పబ్లిసిటీని తర్వాతి స్థాయిలో అనే విధంగా నిర్వహించాలని రాజు అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే వైష్ణవి చైతన్య డేట్లు బుక్ చేసుకోవాలని తన బృందానికి ఆయన సూచించినట్టు తెలుస్తోంది.. అసలే దిల్ రాజు.. పైగా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అడిగితే కాదనుకుంటా ఎలా ఉంటుంది.. అటు టిల్లు, ఇటు వైష్ణవి ఫుల్ బిజీగా ఉండడంతో జాక్ సినిమా షూటింగ్ ఒక్కసారిగా ఆగిపోయింది.

    ముందుగానే జాక్ సినిమా షూటింగ్ కు అన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ.. అనుకోని అవాంతరాల వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడుతోందని ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్. అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఎవరూ దీని గురించి పట్టించుకోరు. ఒకవేళ టిల్లు స్క్వేర్ ఈ స్థాయిలో విజయం అందుకోకపోయి ఉంటే ఈపాటికి జాక్ సినిమా షూటింగ్లో పాల్గొనేవాడు కావచ్చు. సో మొత్తానికి అటు టిల్లు హీరో, ఇటు బేబీ హీరోయిన్.. బిజీగా ఉన్నారు.. ఈ సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ నిశ్శబ్దంగా ఉండడం తప్ప.. చేసేదేమీ లేకుండా పోయింది.