Pushpa 2 Shooting: ఊర మాస్ లెవల్లో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ అప్పుడే ప్రకటించారు. కానీ పార్ట్ 2 కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దీంతో వారికి గుడ్ న్యూస్ చెప్పాడు సుక్కు. పుష్ప 2 వర్క్ మొదలైందని తేల్చాడు. అంతకుముందు లోకేషన్ల కోసం బ్యాంకాక్, శ్రీలంక అడవులను పరిశీలించారు. ఇటీవల మూవీ టీం బ్యాంకాక్ వెళ్లింది. ఈ రెండు దేశాల్లోని అడవుల్లో ఏదో ఒకటి డిసైడై అక్కడే షూటింగ్ నిర్వహించున్నారు. ఇక రీసెంట్ గా పుష్ప 2 కోసం అన్నపూర్ణ స్టూడియోలో బన్నీ ఫొటోలకు ఫోజులిచ్చాడు. దీంతో పుష్ప 2 షూటింగ్ మొదలైనట్లేనని తెలుస్తోంది.

కూలీగా ఎంట్రీ ఇచ్చి వ్యాపారవేత్తగా ఎదిగిన పుష్ప.. ఆ తరువాత ఏం చేయన్నాడు..? అనేది పుష్ప 2 లో చూపించనున్నారు. అయితే దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ అసలు స్టోరీ ఏంటనేది స్క్రీన్ పైకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అల్లు అర్జున్ కెరీర్లో నే ఊర మాస్ లెవల్లో వచ్చిన పుష్ప 2 కోసం భారీగానే కసరత్తులు చేయనున్నాడు. పుష్ప 1 లో అడవిలో ఉండే కూలీ గెటప్ లో కనిపించాడు. ఊహించని ఫైట్స్ తో ఫ్యాన్స్ కు మంచి బూస్టు నిచ్చాడు. కానీ రెండో పార్ట్ లో అంతకుమించి ఫైట్స్ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
పుష్ప 2లో పులితో ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే దానిపై చర్చిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేశాడు. అయితే సేమ్ అలా కాకుండా కొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ పులి ఫైట్ సినిమాలో ఉండదని.. కేవలం టీజర్ వరకేనని కొందరు అంటున్నారు. అయితే సీజీ వర్క్ పూర్తయిన తరువాత చివరలో ఆ విషయం గురించి నిర్ణయిస్తారట. ఏదేమైనా పుష్ప 2లో విభిన్న సీన్స్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

అన్నీ అనుకున్న సమయానికి పూర్తయితే 2023 డిసెంబర్లో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. పుష్ప 1 ను కేవలం తెలుగు,తమిళం హిందీ, మలయాళంలో రిలీజ్ చేశారు. కానీ పుష్ప 2కు భారీ బడ్జెట్ కేటాయించి ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే బన్నీ ఫిల్మ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా పుష్ప 2 నిలవనుంది. అయితే ఆ లెవల్లో బన్నీ సైతం ఫిజిక్ ను మెయింటేన్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అటు పుష్ప 2లోనూ రష్మిక అలరించే అవకాశం ఉంది.