Site icon OkTelugu

Bharathiraja Passed Away: ఎందరో స్టార్ లను తయారు చేసిన ప్రముఖ దర్శకుడి దుర్మరణం…

Bharathiraja Passed Away

Bharathiraja Passed Away

Bharathiraja Passed Away: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ‘భారతీ రాజా’ ఇక లేరు అనే విషయం ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది.4 దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరికెక్కించి ఎంతో మంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కింది. అలాంటి దర్శకుడు ఈరోజు ఉదయం తన తుది శ్వాస విడిచారనే విషయం తమిళ్ ఇండస్ట్రీ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది… ఆయన తెలుగులో ‘సీతాకోకచిలుక’, మెగాస్టార్ చిరంజీవి ని హీరోగా పెట్టి ‘ఆరాధన’ అనే సినిమా చేశాడు..ఒక రకంగా చిరంజీవి ఏరి కోరి మరి అతనితో సినిమా చేశాడు. జమదాగ్ని లాంటి గొప్ప సినిమాలను చేశాడు. నిజానికి ఆయన సినిమాల్లో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆ ఎమోషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకెళ్లగలిగిన ఘనత కూడా తనకే దక్కింది. అలాంటి దర్శకుడు ఎంతో మంది రచయితలకు, దర్శకులకు ఇన్స్పిరేషన్ గా కూడా మారాడు…1941 జూలై 17 న జన్మించిన భారతీరాజా ’16 వయదినిలే ‘ తెలుగులో (పదహారేళ్ళ వయసు) మూవీ తో దర్శకుడిగా మారాడు.

‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇక్కడ చాలా సక్సెస్ లను కూడా అందుకున్నాడు. ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచాయి. ఆరుసార్లు నేషనల్ అవార్డుని అందుకున్న ఘనత కూడా తనకే దక్కింది… రాధ, రాధిక, కార్తీక్ ఎంతోమంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకి దక్కడం విశేషం…

ఇక బాలయ్య బాబు హీరోగా చేసిన ‘మంగమ్మగారి మనవడు’ సినిమాకి రచయితగా వ్యవహరించాడు. అలాగే ‘పల్నాటి పౌరుషం’ సినిమాకి స్క్రీన్ ప్లే ని అందించిన ఘనత కూడా తనకే దక్కింది. ఇక మోహన్ లాల్ హీరోగా మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన తుడురుమ్ చివరిసారిగా కనిపించాడు.

ఈ మూవీలో కూడా అతని పాత్రకి చాలా మంచి ప్రాముఖ్యత అయితే దక్కింది. సినిమా ఇండస్ట్రీ కి తను అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ని ‘పద్మ శ్రీ’ పురస్కారంతో సత్కరించింది… గతేడాది తన కుమారుడు గుండెపోటుతో మరణించడంతో అప్పటినుంచి కృంగిపోయిన భారతీ రాజా కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు… మొత్తానికైతే ఈరోజు ఉదయం ఆయన తన తుది శ్వాసను విడవడం అనేది ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తుంది. అలాంటి లెజెండరీ దర్శకుడికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కన్నీటి వీడ్కోలు పలుకుతుంది…

Exit mobile version