Tollywood Heroines: గాయాలను లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొన్న హీరోయిన్ లు..

గాయం ఎలాంటిది అయినా దాని తాలూకు నొప్పి కచ్చితంగా ఉంటుంది. అయితే త్రిష మాత్రం గాయం తాలూకు నొప్పి తెలియదన్నట్టు నటించింది.

Written By: Swathi, Updated On : April 4, 2024 5:21 pm

Tollywood Heroines

Follow us on

Tollywood Heroines: ఎన్ని కష్టాలు వచ్చినా ఒక సినిమా ఒప్పుకుంటే.. కొంత మంది కష్టపడి మరీ సినిమాను నిలబెట్టాలి అని చూస్తారు. వారి పరిస్థితులను కొన్ని సార్లు లెక్క చేయరు. అయితే షూటింగ్ లోనే ప్రమాదాలు సంభవించినా వెంటనే కోలుకొని ఆ తాలూకు గాయం నుంచి బయటపడి మరీ.. షూటింగ్ ను పూర్తి చేసుకుంటారు. అయితే గాయం తియ్యగా ఉంటుందా అంటే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. కొందరు కథానాయికలు కొన్ని గాయాలను అలానే తీసుకుంటారు కూడా. పవర్ ఫుల్ రోల్స్ చేసేటప్పుడు అయిన గాయాలను లెక్క చేయరు. గాయాలు అయినా షూట్ పూర్తి చేసుకుంటారు. నిజంగానే ఇలాంటి హీరోయిన్ లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సమంత కష్టానికి ఫలితం..
సమంత ఈ మధ్య ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని తెలిసిందే. మయోసైటిస్ తో పోరాటం చేస్తూనే ఈ అమ్మడు సినిమాను పూర్తి చేసింది. చేతికి సెలైన్ పెట్టుకొని సినిమాకు డబ్బింగ్ చెప్పిన ఫోటోను పోస్ట్ చేసింది సమంత. అప్పుడు ఆమె అభిమానులు ఎంతో బాధ పడ్డారు. అప్పుడే కాదు మరోసారి సమంత `సిటాడెల్` వెబ్ సిరీస్ లో పోరాట సన్నివేశాల్లో నటించింది. ఈ సిరీస్ లో సమంత పవర్ రోల్ లో నటించింది. ఇందుకోసం యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ వద్ద శిక్షణ తీసుకుంది కూడా. ఆ తర్వాతనే షూట్ లోకి వచ్చింది. ఇక ఈ యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు ఆమె రెండు చేతులకు గాయాలు అయ్యాయి. ఆ ఫోటోను సమంత షేర్ చేయడంతో అభిమానులు ఎంతో బాధ పడ్డారు. కానీ ఇలా ఎన్ని ఇబ్బందులు, అవరోధాలు ఎదురైన సమంత మాత్రం తన ప్రయాణాన్ని ఆపడం లేదు.

నొప్పి మరిచిన భామలు..
గాయం ఎలాంటిది అయినా దాని తాలూకు నొప్పి కచ్చితంగా ఉంటుంది. అయితే త్రిష మాత్రం గాయం తాలూకు నొప్పి తెలియదన్నట్టు నటించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమా షూట్ లో అమ్మడుకు గాయాలు అయిన సంగతి తెలిసిందే.ఇక జయం, రవి, కార్తీ, ఐశ్వరయ్యరాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చింది. పొన్నియన్ సెల్వన్ 1 ఇప్పటికీ రిలీజై ఎంతో మందిని ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలో త్రిష పాత్ర యువరాణిగా ఉంటుంది. పోరాట సన్నివేశాల్లో నటించినప్పుడు తన చేతులకు గాయాలు అయ్యాయి. అంతే కాదు శోభిత అనే పాత్ర చేస్తున్నప్పుడు చెవులకు కూడా గాయాలు అయ్యాయట. కానీ గాయాలు అయ్యాయని షూట్ ని ఆపకుండా.. ఆ నొప్పిని మరిచిపోయి గ్యాప్ లో కబుర్లు చెప్పుకొని.. మళ్లీ షూటింగ్ లో బిజీ అయిపోయిందట త్రిష. ఇక ఈ సినిమా తన జీవితంలో ఒక మంచి జ్ఞాపకం అంటుంది త్రిష

జాన్వీకపూర్..
మిస్టర్ అండ్ మిసెస్ సినిమా కోసం కెమెరా ముందు క్రికెట్ ఆడినప్పుడు రెండు సార్లు తన భుజానికి గాయం అయిందట జాన్వీ కపూర్ కి… ఎముక పొజిషన్ కూడా మారిందని.. అయినా అది తియ్యని గాయం అనుకుంటున్నాను అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అంతే కాదు ఒంటరిగా కూర్చుని తాను చేసిన సినిమాల గురించి ఆలోచించుకుంటే ముందుగా గుర్తువచ్చే సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహీ అని అంటుంది ఆమె.