https://oktelugu.com/

Renu Desai : ఇన్ స్టా లో రేణు దేశాయ్ కి షాక్ ఇచ్చిన ఫాలోవర్స్… మ్యాటరేంటంటే..?

పవన్ కళ్యాణ్ భార్య గా ఒక్కప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకున్న రేణు దేశాయ్...వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థలతో ఆయన నుంచి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది..

Written By:
  • Gopi
  • , Updated On : July 21, 2024 / 11:53 AM IST
    Follow us on

    Renu Desai : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు చాలా సినిమాలను చేస్తు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే కొంతమంది నటీమణులు చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకుంటారు. ఇక ఆ విషయానికి వస్తే ‘బద్రి ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ‘రేణు దేశాయ్’ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా నటిగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ ని ప్రేమించడం కొద్దిరోజులు ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత ఆమె ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ చేసిన ‘జానీ ‘ సినిమాలో మరొకసారి కనిపించి మెప్పించింది. ఇక ఇదిలా ఉంటే ఆమె పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన నుంచి విడిపోయి ప్రస్తుతం పూణేలో పిల్లలతో కలిసి ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా వచ్చిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుసగా సినిమాలు చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె మాత్రం సినిమాల్లో సెలెక్టెడ్ పాత్రలను మాత్రమే చేస్తాను అని చెప్పి అందరికీ ఒక షాక్ ఇచ్చింది. ఇక మొత్తానికైతే ఆమె సినిమా నుంచి దూరంగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు.

    ఆమె లైఫ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తమ అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో ప్రతి వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఆమె సమాజంలో జరుగుతున్న చాలా విషయాల మీద కూడా స్పందిస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటారు. దీనివల్ల ఆమె అభిమానులకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు.

    అది ఏంటి అంటే ఒక పెట్ కి సర్జరీ చేయించాలని దానికోసం తల కొంత విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఆమె ఊహించినదానికి భిన్నంగా తన ఫాలోవర్స్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆమె తీవ్రంగా బాధపడినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పోస్ట్ మీద తను స్పందిస్తూ నాకు ఇన్ స్టా లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటిది అందులో కేవలం పది మంది మాత్రమే నేను పెట్టిన పోస్ట్ కి స్పందించి విరాళాలు చేయడానికి ముందుకొచ్చారు…
    అందరిలో సహాయం చేయాలనే గుణం తగ్గిపోయిందా ఎందుకిలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆమె ఈ విషయం మీద స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది…

    ఇక మొత్తానికైతే రేణు దేశాయ్ ఊహించిన దాని కంటే భిన్నంగా తన ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆమె ఈ పరిణామాన్ని చూసి తట్టుకోలేకపోతుంది… అలాగే ఆమెకి ఇన్ స్టా లో తన ఫాలోవర్స్ ఒక పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కొంతమంది ఆమె పెట్టిన పోస్ట్ పక్కన పెట్టి ‘అకిరా నందన్’ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.