Brahmanandam: ఒకప్పుడు టాలీవుడ్ పంచాయితీల్లో పరిటాల రవి హస్తం ఉండేది. ఏకంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి భూమినే కబ్జా చేశారనే వాదన ఉంది. దీనిపై గతంలో కథనాలు వెలువడ్డాయి. కమెడియన్ బ్రహ్మానందం తో ఓ నటుడికి వివాదం తలెత్తగా.. సదరు నటుడిని మోహన్ బాబు, పరిటాల రవి ఇంటికి పిలిపించారట. ఆ వివాదం ఏమిటో చూద్దాం. శివాజీ రాజా టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరు. ఆయన విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాల్లో నటించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడి అధ్యక్షుడు అయ్యారు. ఆయన సారథ్యంలో పలువురు పేద ఆర్టిస్ట్స్ సహాయం పొందారనే వాదన ఉంది. కోవిడ్ సమయంలో కూడా నిత్యావసరాలు సరఫరా చేసి ఆర్టిస్ట్స్ ని ఆయన ఆదుకున్నారు కాగా గతంలో శివాజీ రాజా-బ్రహ్మానందం మధ్య వివాదం నెలకొందట. మల్లికార్జున రావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, మరికొందరు కమెడియన్స్ తో కలిసి శివాజీ రాజా ట్రస్ట్ ఏర్పాటు చేశారట.
ఈ ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అయ్యాయని భావించిన శివాజీ రాజా నటుడు బ్రహ్మానందాన్ని నిలదీశాడట. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొందట. బ్రహ్మానందం స్టార్ కమెడియన్ కావడంతో గొడవ విషయం పరిశ్రమ మొత్తం పాకిందట. అప్పట్లో ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చలామణి అవుతున్న మోహన్ బాబు దృష్టికి ఈ గొడవ వెళ్లిందట. దాంతో శివాజీ రాజాను మోహన్ బాబు ఇంటికి పిలిపించారట. శివాజీ రాజా మోహన్ బాబు ఇంటికి వెళ్లగా.. అక్కడ పరిటాల రవి కూడా ఉన్నారట.
శివాజీ రాజాను కుర్చోమన్న మోహన్ బాబు కాఫీ తాగు అన్నారట. తర్వాత బ్రహ్మానందంతో ఏంటి గొడవ? అని అడిగారట. శివాజీ రాజా చెబుతుండగా… మధ్యలో కల్పించుకున్న పరిటాల రవి, ఎందుకయ్యా గొడవలు, కామ్ గా ఉండాలి కానీ… అని అన్నారట. బ్రహ్మానందంతో అన్నీ సెటిల్ చేసుకున్నాను. ఎలాంటి గొడవలు లేవని శివాజీ రాజా చెప్పాడట. దాంతో మోహన్ బాబు శివాజీ రాజాను మెచ్చుకుని ఇంటికి పంపారట. ఓ ఇంటర్వ్యూలో శివాజీ రాజా ఈ వివాదాన్ని బయటపెట్టారు.