Nithin Thammudu Movie: ఇప్పటివరకు ఇండియాలో ఉన్న చాలామంది హీరోలు భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…ఇక మీదట మన స్టార్ హీరోలు చేయబోతున్న సినిమాలు సైతం పాన్ ఇండియా రికార్డు లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం…
Also Read: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే లభిస్తోంది. నితిన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 23 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు ఆయనకు స్టార్ హీరో ఇమేజ్ అయితే రాలేదు. ఆయన చేసిన సినిమాలు సక్సెస్ లను సాధించినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా మాత్రం మారలేకపోతున్నాయి. ఇప్పటి వరకు ఆయన చేసిన ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించలేదు. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా డిజాస్టర్ల బాట పడుతున్న ఆయన జులై 4వ తేదీన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసిన తమ్ముడు (Thammudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన మరోసారి స్టార్ హీరోగా అవతరిస్తాడు. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సంవత్సరంలో వచ్చిన రాబిన్ హుడ్ (Robin hud) సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…
ఈ సినిమాతో కనుక ప్లాప్ ను మూట కట్టుకుంటే నితిన్ (Nithin) మార్కెట్ భారీగా డౌన్ అయిపోతోంది. కాబట్టి ఇకమీదట ఆయన చేయబోయే సినిమాల మీద కూడా ఆ ఎఫెక్ట్ అయితే పడొచ్చు. ప్రస్తుతం ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇవ్వలేకపోతున్నాడు.
నాని లాంటి హీరో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే నితిన్ మాత్రం భారీ బడ్జెట్ సినిమాలను చేయలేకపోతున్నాడు. ఒకవేళ చేసిన ఆ సినిమాలను సైతం సక్సెస్ ఫుల్ గా నిలపలేకపోతున్నాడు. తమ్ముడు సినిమాతోనే ఆయన కెరీర్ ముడిపడి ఉంది.
మరి ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాతో మరోసారి ఘన విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? ఇప్పుడు భారీ గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…